Home » Devotional » Today Horoscope February 22 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : ఫిబ్రవరి 22 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Updated on: February 21, 2022, 11:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఉత్సాహంగా ఉంటుంది. అనుకూలమైన ఫలితాలతో ఈరోజు గడుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు.ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. అనుకోని ఇబ్బందులు. ఆర్థిక నష్టాలు. ప్రయాణ చికాకులు కనిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికి మాట, ధనం ఇవ్వకండి. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కుజగ్రహారాధన చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఆనందంగా గడుస్తుంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని అతిథి రాకతో సంతోషం. మహిళలకు మంచిరోజు. దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : పని భారం పెరిగినా వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు మంచి రోజు. శ్రీలక్ష్మీకుబేర ఆరాధన చేయండి.

Today Horoscope february 22 2022 check your Zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారికి బాగుంటుంది. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. మహిళలకు మంచి రోజు. శ్రీశివార్చన చేయండి.

కన్య రాశి ఫలాలు : ప్రశాంతత నెలకొని మీకు, ఇంట్లో వారికి మంచిగా ఉండే రోజు. పెద్దల మాటలను ఆచరించి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. ప్రమోషన్‌కు అవకాశం. దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు. మహిళలకు ధనలాభం. శివుడిని పార్థివ లింగాన్ని ఆరాధించండి.

Advertisement

తులారాశి ఫలాలు : మిత్రులతో విబేధాలు పెరుగుతాయి. అనుకోని నష్టాలు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆస్తి సంబంధ విషయాలలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలతలతో కూడిన రోజు. ఆర్థిక ఇబ్బందులు. పని భారం పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు. మహిళలకు మామూలుగా ఉంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

ధనస్సురాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అప్పులు తీరుస్తారు. అనారోగ్య సమస్యలు తీరుతాయి. కుటుంబంలో సంతోషం. మహిళలలు శుభవార్తలు వింటారు.మిత్రులతో విందులు, వినోదాలకు హాజరవుతారు. కులదేవతను ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి సాదారణంగా ఉంటాయి. కుటుంబంలో ముఖ్య మార్పులు జరుగుతాయి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. ఆఫీస్‌లో పని భారం పెరుగుతుంది. శత్రువుల ద్వారా ఇబ్బందులు. మహిళలకు అనుకోని చికాకులు. శ్రీ కనకదుర్గా దేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ధైర్యంతో ముందుకు పోతారు. అనందంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ఆర్తిక పరిస్థితి పురోగమిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శుభ వార్తలు. మహిళలకు మంచిరోజు. శ్రీ శివార్చన చేయండి.

మీన రాశి ఫలాలు : అభివృద్ధి మార్గంలో పయనిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని వ్యక్తుల ద్వారా ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల ద్వారా సంతోషం. అత్తమామల ద్వారా ఆర్తిక లాభాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి