
today horoscope in telugu
మేషరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు కలుగుతాయి. కానీ మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. ఆఫీస్‌లో పనులు ముందుకు సాగవు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. విద్యార్థులు కష్టించినా ఫలితం కనిపించదు. సోమేశ్వర స్వామికి అభిషేకం చేయండి. వృషభరాశి ఫలాలు :ఈరోజు మంచిరోజు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆశ్చర్యక రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆఫీస్లో పెద్దల పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగుతాయి.
మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన రోజు. ఆఫీస్‌లో
వివాదాలకు అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు. పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిన రోజు. శివాభిషేకం లేదా మారేడు దళాలలతో అష్టోతర పూజ చేయించుకోండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సంతోషం, ఫుల్ ఎనర్జీతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆఫీస్‌లో వ్యవహారాలలో విజయం. స్నేహితులతో లేదా బంధువుల శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీదుర్గాదేవి సూక్తం పారాయణం చేయండి.
today horoscope in telugu
సింహరాశి ఫలాలు : ఈరోజు పెద్దల సలహాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక స్తితి బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాబాల బాటలో సాగుతాయి. ఆఫీస్‌లో కొత్త వార్తలు వింటారు. వైవాహికంగా మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన రోజు. అనుకోని సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు. రుణాలు చేయాల్సిన స్థితి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఈరోజు మీకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో గందరగోళం. విద్యార్థులకు మంచిరోజు. అమ్మవారికి కుంకుమ పూజ చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపార విషయాల్లో, ఒప్పందాలలో ఆటంకాలు. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటాయి. రుద్రాభిషేకం చేయించుకోండి.
వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు విజయాలు పొందుతారు. పాత మిత్రులను కలుస్తారు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. ఆర్థికస్థితి బాగుంటుంది. విద్యార్థులకు కార్యసిద్ధి. పెద్దలతో పరిచయాలు. వైవాహికంగా మంచి రోజు ఆనందంగా గడుపుతారు. శివారాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీస్లో పై అధికారులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాబాలు గడిస్తారు. ఇష్టమైనవారిని కలుస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. శ్రీరామ తారకాన్ని జపించండి,
మకరరాశి ఫలాలు :ఈరోజు పనులు మందుకు సాగవు. కుటుంబంలో అనుకోని సమస్యలు వస్తాయి. ఓపికతో పెద్దల సలహాలను పాటించండి. ఆర్థికంగా బాగుండదు. ధనం కోసం రుణాలు చేస్తారు. విద్యార్థులకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, మందగిస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీసూక్త విధానంలో అమ్మవారి పూజ చేయండి.
కుంభరాశి ఫలాలు : ఈరోజు పరిస్థితులు పెద్దగా అనుకూలించదు. ఆఫీస్‌లో పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. అప్పులు చేయకండి. ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండిఆఫీస్‌లో బాధ్యతలు పెరుగుతాయి. శివాలయంలో దీపారాధన, పూజ చేయండి మంచి పలితాలు వస్తాయి.
మీనరాశి ఫలాలు : ఈరోజు మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు. పెద్దల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా మంచిరోజు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కార్యజయంవైవాహికంగా సంతోషం కలిగించే రోజు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన చేయండి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.