today horoscope in telugu
మేష రాశి ఫలాలు : ఈరోజు మీకు ఆనందం, సంతోషం సొంతం. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అదృష్టం కలసి వస్తుంది. ఈరోజు ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. కుటుంబంలో సంతోషం. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఆనంద క్షణాలు ఈరోజు మీకు లభిస్తాయి. శ్రీరామ తారక మంత్రాన్ని మనస్సులో జపించుకోండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు మీకు బాగుంటుంది. అనుకోని మిత్రుల ద్వారా లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారీకి లాభాలు రావచ్చు. ఈరోజు మీకు బాగా కలసివస్తుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. ప్రయాణాలు కలసి వస్తాయి. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. ఈరోజు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఇష్టమైన వారు కలసే అవకాశం ఉంది. వివాహజీవితం బాగుంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో ముందుకు పోతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.
today horoscope in telugu october 07 wednesday 2021
మిథున రాశి ఫలాలు : ఈరోజు భవిష్యత్‌కు పునాది రోజులలో ఒకటిగా ఉంటుంది. ఫుల్ ఎనర్జీతో ముందుకు పోతారు. జూదాలకు, బెట్టింగులకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో అదనపు శక్తిని పొందుతారు, ఈరోజు మీరు ఓర్పుగా ఉండాలి. కొన్ని విషయాలలో అనవసర టెన్షన్ కలగవచ్చు. కొత్త పనులు ప్రారంభించాడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఇంటా బయటా బిజీగా గడుపుతారు. పిల్లల విషయాలను పట్టించుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది. ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి. శ్రీశివ కవచం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు :ఈరోజు మంచి రోజు. మీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి మంచి రోజు ఇది. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్త. అనవసర వ్యక్తులకు అప్పు ఇవ్వకండి. ఈరోజు ఇంట్లో సభ్యులు కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు. కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో అనవసర వాదాలు రావచ్చు. వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రమకు తగ్గ పేరు, వృద్ధి లభిస్తాయి. హనుమాన్ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
today horoscope in telugu
సింహ రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్య నియమాలను పాటించండి. ఆర్థిక విషయాలలో జాగరూకత మంచిది. ఇంట్లో వారితో ఆర్థిక విషయాలలో కొన్ని సమస్యలు లేదా ఇబ్బందులు రావచ్చు. విశ్రాంతి సమయం చాలా ఉంటుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఇంట్లో వారు కోపాన్ని ప్రదర్శిస్తారు. పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. వైవాహికంగా బాగుంటుంది. విష్ణు, దుర్గా ఆరాధన చేయండి. కన్యా రాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. మీ శక్తి స్థాయి ఎక్కువగా ఉంటుంది పెట్టుబడులు,పొదుపుల విషయంలో పెద్దలతో మాట్లాడవలసి ఉంటుంది. వారి సలహాలు మీ ఆర్థికస్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీ రెస్యూమ్ని పంపించడానికి, ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి ఈరోజు మంచి రోజు. వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. దుర్గాదేవిని ఆరాధించండి అనుకూల ఫలితాలు వస్తాయి.
తులా రాశి ఫలాలు : ఈరోజు ఊహలకు స్థానమివ్వకండి. సమయాన్ని వృధా చెయ్యకండి. ఈరోజు మీకు అనుకోని విధంగా ఆర్థిక లబ్ది. కుటుంబంలో పరిస్థితులు అంత సంతోషకరంగా ఉండవు. మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఈరోజు మీరు నిగ్రహంగా ఉండాలి. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యులులేదా జీవిత భాగస్వామితో చెప్పి చేయండి.విద్యార్థులు మంచి మార్కులు, లేదా మంచి ర్యాంకు పొందుతారు. పార్వతీదేవి దేవాలయం దర్శించండి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు మనస్సు అదుపులో పెట్టుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. దేవాలయ దర్శనం చేయండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్లలో మదుపు చేయండి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. కార్యాలయల్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకూలమైన వాతావరణంతో జీవితభాగస్వామితో గడుపుతారు. విద్యార్థులకు మంచి రోజు. శ్రీ సరస్వతి దేవి ఆరాధన చేయండి.
today horoscope in telugu
ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చాలా మంచిరోజు. సానుకూలమైన ఫలితాలు వస్తాయి.ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. విద్యార్థులు కొత్త ప్రయత్నాలు చేయడానికి మంచి రోజు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనవసర విషయాలను ఇంట్లో ప్రస్తావించకండి. మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకొండి. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొత్త పెట్టుబడులు పెట్టండి. నూతన గృహం కొనడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాటాలో నడుస్తాయి. మంచి లాభాల కోసం అవునెయ్యితో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. మకర రాశి ఫలాలు : ఈరోజు మానసిక వత్తిడులు అధికంగా ఉంటాయి. యోగా, ధ్యానంతో మంచి ఫలితాలను పొందుతారు. ధనం విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. పెద్దల ఆశీస్సులు లేనిదే మీరు ఏ పనిని ఈరోజు చేయకండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో వివాదాలకు తావివ్వకండి. జీవిత భాగస్వామితో పాత విషయాలు గుర్తు చేయకండి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాల్సిన రోజు ఇది. శ్రీలక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
today horoscope in telugu
కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీకు అనవసర ఖర్చులు రావచ్చు. ధనం విషయంలో ఆచితూచి అడుగు వెయ్యిండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో శ్రద్ధతో పని చేయండి. పై అధికారులు మీ పై నిఘా ఉంచే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపండి. ఏదైనా దేవాలయం లేదా పార్కుకు వెళ్లండి. వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. వైవాహిక జీవితం సాధారణంగా గడుస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి. మీన రాశి ఫలాలు :ఈరోజు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహకారంతో ధనాన్ని బాగా అర్జిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీసులో మీ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి మీ బాస్‌తో మాట్లాడటానికి ప్రయత్నించండి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు కలసి వస్తాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శ్రీ దత్తకవచం వినడం లేదా చదవడం చేయండి మంచి ఫలితం వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.