Home » Devotional » Today Horoscope January 09 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 09 ఆదివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Devotional Desk
The Telugu News | Published on: January 8, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఈరోజు మీరు సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. చాలా రోజుల నుంచి ఉన్న సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. మంచి వార్తలు వింటారు.విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు శుభంగా ఉంటుంది. ఇష్టదేవతరాధన చేయండి, వృషభరాశి ఫలాలు : మంచి వాతావరణం. అనుకూలమైన ఫలితాలు. శుభకరమైన రోజు. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆర్థికంగా మంచిగా ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు మంచిగా ఉంటుంది. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : ఆటంకాలు. అనుకోని సమస్యలతో కూడుకున్న రోజు. చికాకులు. ఆర్థిక మందగమనం. పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీదుర్గా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కుటంబంలో అనుకోని మార్పులు. పనులు నెమ్మదిగా అవుతాయి. ఆర్థిక మందగమనం అవుతుంది. కుటుంబంలో వత్తిడి పెరుగుతుందిఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అనుకోని మార్పులు. మహిళలకు విశ్రాంతి దొరకదు. శ్రీ శివాష్టకం పారాయణం చేయండి.

Today Horoscope january 09 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. అనుకూలమైన వాతావరణం. స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధవుల నుంచి శుభవార్తలు. ఆర్థిక విషయాలు బాగుంటాయి. వ్యాపారాలు అనుకూలం. మహిళకు శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : అశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. మిత్రలతో తగాదాలు. అనారోగ్య సూచన. మహిళలకు పని వత్తిడి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం రాదు. అన్నింటా చికాకులు. అపజయానికి అవకాశం. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అనారోగ్య సూచన. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు మాటపట్టింపులు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : విజయం వరిస్తుంది. ఆర్థిక పురోగతి. అనుకూల వాతావరణం. ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు. ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

మకరరాశి ఫలాలు : పనులు ముందుకు సాగవు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు నత్తనడుక సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనకూలించవు. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. ఇంట్లో, బయటా పరిస్థితులు గందరగోళం. మహిళలకు అనారోగ్య సూచన. శివుడిని మారేడు దళాలతో ఆర్చన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలుః : కొత్త అవకాశాలు వస్తాయి. పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు, విద్యార్థులకు కొత్త అవకాశాలు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. మహిళలకు అనుకూలమైన రోజు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : పనులలో జాప్యం. మానసిక తాపం. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు పెద్దగా సాగవు. శ్రమ పెరుగుతుంది. శారీరక అలసట. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని ఖర్చులు పెరుగతాయి. మహిళలకు పని భారం. శ్రీ ఆదిత్య హృదయం చదువుకోండి.

Devotional Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి