horoscope July 2022 check your zodiac signs Pisces
మేషరాశి ఫలాలు : కొంచెం ప్రతికూలతలతో ఈరోజు గడుస్తుంది. అనుకోని నష్టాలు. ఆర్థిక సమస్యలు. చికాకులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఐటీ, ఇండస్ట్రి, రియల్ రంగాల వారికి గందరగోళం. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.వృషభరాశి ఫలాలు : ప్రతి విషయంలోనూ చికాకులు కనిపిస్తాయి. అనారోగ్య సూచన. పెద్దల ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులకు,ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకోని చికాకులు, పని భారం పెరుగుతుంది. శ్రీదుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.
మిథునరాశి ఫలాలు : చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అనుకోని లాభాలు. వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలో శుభకార్య యోచన. ఐటీ, రాజకీయం, ఉద్యోగులకు, విద్యార్థులకు అనకూలమైన రోజు. మహిళలకు శుభ దినం. శివారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆనందంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయం, ఐటీ, రియల్, మెడికల్ రంగాల వారికి మంచి ఫలితాలు వస్తాయి. మహిళలకు స్వర్ణ లాభ ప్రాప్తికి అవకాశం. ఇష్టదేవతరాధన చేయండి.
Today Horoscope january 30 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : పని భారం పెరుగుతుంది. అనుకోని నష్టాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఇంట్లో వారితో మాటపట్టింపులు. ఐటీ, రియల్, ఇండస్ట్రి, ఉద్యోగులకు చిన్నిచిన్న సమస్యలు రావచ్చు. మహిళలకు మనఃశాంతి కరువు. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి లేదా మనస్సులో ధాన్యం చేయండి.
కన్యారాశి ఫలాలు : పనుల్లో ఆటంకాలు. ఆదాయం తగ్గుతుంది. అప్పులు కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులకు, విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. ఐటీ, రియల్, బిజినెస్ వారికి సాధారణంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం రాదు. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచి రోజు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పెద్దల సహాయంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రియల్, ఐటీ, రాజకీయం, విద్యార్థులకు పురోగతి కనిపిస్తుంది. మహిళలకు మంచి రోజు. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన, ధ్యానం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. కొంచెం శ్రమిస్తే తప్ప మంచి ఫలితాలు రాని రోజు ఇది. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరిగిపోతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఐటీ, ఇండస్ట్రీ, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మహిళలకు ఆందోళనగా ఉండే రోజు. శ్రీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అనుకున్నవి సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా ఉండే రోజు. ఆదాయం బాగా పెరుగుతుంది. పెద్దల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మహిళలకు సంతోషం నిండేరోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. రియల్, ఐటీ, రాజకీయ రంగాల వారికి సమస్యలు రావచ్చు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ రామా రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, కొత్త విలువైన వస్తువులు కొంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మహిళలకు ఉత్సాహం, సంతోషం నిండినరోజు. విద్యార్థులకు శుభ వార్త శ్రవణం. ఇష్టదేవతరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : చాలా బాగుంటుంది ఈరోజు. అనుకున్నవి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సంపాదిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగులకు అనుకూల స్థాన చలనం. విద్యార్థులకు మంచి ఫలితాలు. ఐటీ, రియల్, వ్యాపారం, రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.