Home » Devotional » Today Horoscope July 04 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 04 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 3, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలతో ఈరోజు గడిచిపోతుంది. అన్ని రకాల వ్యవహారాలలో పూర్తి విజయం సాధిస్తారు. ధన సంబంధ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. వృషభ రాశి ఫలాలు : దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్లాన్‌ చేస్తారు. ఆర్థిక విషయాలలో సామాన్యంగా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు చేస్తారు. ఆస్తి సంబంధవిషయాలలో అనుకూలత కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కొంచెం కష్ట పడాల్సిన సమయం. అనుకోని ఖర్చులు వస్తాయి. దీర్ఘాకాలిక రోగాలు ఉన్నవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. షేర్‌, ట్రేడింగ్ విష యాలలో అనకూలత తక్కువగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో ఇబ్బంది. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి పనులు ప్రారంభిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. విద్యార్తులకు శుభఫలితాలు. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ పార్వతీ పరమేశ్వర ఆరాధన చేయండి.

Today Horoscope July 04 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చాలాకాలం తర్వాత శుభవార్తలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. మంచి పనులు ప్రారంభిస్తారు. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు. ప్రయాణ సూచన. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత కనిపిస్తుంది. తల్లితరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు అనకూలత కనిపిస్తుంది. ఉమ్మడి పెట్టుబడికి అనుకూలత తక్కువగా ఉంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకోని లాభాలు వస్తాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సానుకూల మార్పులు జరుగుతాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు తీరుతాయి. అమ్మవారి ఆరాదన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రంగాల వారికి సానుకూలత తక్కువ. చేసే పనులలో వేగం తగ్గుతుంది.
వ్యాపారాలలో లాభాలు తక్కువ వస్తాయి. ఆదాయం తక్కువ అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ, కుబేర ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. మద్యాహ్నం నుంచి లాభాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారులకు ఇబ్బందులు. ప్రయాణ సూచన. కోర్టు వ్యవహరాలలో కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. ధనం కోసం చేసే పనుల్లో పురోగతి కనిపించదు. వివాదాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి కానీ ధైర్యంతో ముందుకు పోతారు. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : వ్యయప్రయాసలతో కూడిన రోజు. ఆదాయం కోసం తీవ్రంగ శ్రమిస్తారు. అనుకోని ఖర్చుల వస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. కుటుంబంలో చక్కటి రోజు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు గడిస్తాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి