Home » Devotional » Today Horoscope July 07 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 07 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 6, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ఆటంకాలతో ఈరోజు గడుస్తుంది. అన్నింటా తీవ్రంగా శ్రమించాల్సిన రోజు. దూరపు ప్రాంతాల నుంచి చెడు వార్తా శ్రవణం. ఆదాయం తగ్గుతుంది. వివాదాల పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు సఫలం కావు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ అనుజ్ఞ గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. చాలాకాలంగా దొరకని విశ్రాంతి దొరుకుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. శ్రీసుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత పెరుగుతుంది. మహిళలకు పని వత్తిడి నుంచి బయటపడుతారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు అదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఆస్తి సంబంధ విషయాలలో జాప్యం జరుగుతుంది. విద్య, ఉద్యోగ విషయాలలో సాధారణ పరిస్థితి. మహిళలకు విలువైన సమాచారం లభిస్తుంది. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope July 07 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : అనుకున్న విధంగా ఈరోజు సాగదు. ఆటంకాలతో చికాకులు పెరుగుతాయి. ధైర్యంతో పనులు చేస్తారు. ముందుకుపోతారు. విద్య, ఉపాధి విషయాలలో అనుకూలత తగ్గినా చివరకు మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థికంగా చక్కటి ఫలితం వస్తుంది. శ్రీ గణేష పంచరత్న స్తోత్రం చదువుకోండి మంచి జరుగుతుంది.

కన్యారాశి ఫలాలు : చాలా కాలం తర్వాత ఒక మంచి వార్తను వింటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన రోజు. రియల్‌ ఎస్టేట్‌, మెడికల్‌ రంగంలో వారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రాకున్న సంతృప్తిగా ఉంటారు. మహిళలకు మంచి రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ఈరోజు ఉదయం బాగుంటుంది. సాయంత్రం నుంచి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో మందగమనం కనిపిస్తుంది. అన్నదమ్ముల నుంచి వత్తిడి వస్తుంది. ఆస్తి విషయాలలో నిరాశ మిగులుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : చాలా కాలంగా ధన విషయంలో సంతృప్తి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. అమ్మ తరుపు వారి నుంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలు పొందుతారు. ఆర్థికంగా చక్కటి శుభదినం. చాలా కాలం తర్వాత బంధువుల రాకతో ఇంట్లో సందడి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ఇంటా, బయటా అనుకూలత బాగుంటుంది. శ్రీ విష్ణు ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి శుభఫలితాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చక్కటి వార్తలు వింటారు. ఇంటా, బయటా పని భారం పెరుగుతుంది. అనుకోని వారి నుంచి ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్త. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. పాత బాకీలు, బకాయిలు చేతికి వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా, బయటా శుభసమయం మీకు. మహిళలకు వస్త్ర లాభాలు. ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి