Home » Devotional » Today Horoscope July 21 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జూలై 21 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 20, 2022, 10:42 pm
Advertisement

మేషరాశి ఫలాలు : అన్నింటా చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు చక్కగా సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు మంచి శుభఫలితాలు వస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రీ శక్తి గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఆనందంగా ఉండటానికి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులు, బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీరు చేసే వృత్తి, వ్యాపారాలలో లాభాలు సాధిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : మీరు చాలా శ్రమించాల్సిన రోజు., అనుకున్నదానికి భిన్నంగా ఈరోజు గడుస్తుంది. ఆదాయం కోసం బాగా కష్టపడుతారు కానీ అంతంత మాత్రమే ఫలితం వస్తుంది. మహిళలకు శ్రమ భారం పెరుగుతుంది. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మధ్యస్థంగా ఉండే రోజు. ఇంట్లో ఈరోజు చేయాలనుకునే పనులు పెండింగ్ పడుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ఆఫీస్లో మీరు పై అధికారులతో మాటపడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. వివాదాలు అవకాశం ఉన్న రోజు. దుర్గా దేవి దగ్గర ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి.

Today Horoscope July 2102022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చాలా కాలంగా పడుతున్న బాధల నుంచి విముక్తి పొందుతారు. అప్పులను తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. మంచి ఆహారం, విహారం లభిస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు కొంచెం సంతోషం, కొంచెం దుఃఖం కలుగుతాయి. విదేశీ, వివాహ ప్రయత్నాలకు మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. వృత్తి విషయంలో కొద్దిగా జాగ్రత్తతో మెలగాల్సిన రోజు. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : బాగా శ్రమించాల్సిన రోజు,. వాహనాలను నడిపేటపుడు జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన రోజు. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త. మహిళలకు వంటింటిల్లో జాగ్రత్తగా పనిచేయాల్సినరోజు. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్నింటా జయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం వృద్ది చెందుతుంది. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ సాయిబాబ/రాఘవ్రేంద్రస్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చాలా ఇబ్బంది పడుతారు. అనుకోని వివాదాలు వస్తాయి. చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. అప్పుల కోసం చేసే ప్రయత్నం సఫలం కాదు. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు. మహిళలకు మాటపట్టింపులు. శ్రీలక్ష్మీ, సరస్వతి, దుర్గాదేవి ఆరాధన చక్కటి శుభఫలితాలన ఇస్తుంది.జ

మకర రాశి ఫలాలు : అన్నింటా శుభకరమైన ఫలితాలను సాధిస్తారు. చాలా దూరం నుంచి అందే వార్త మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా సమయానికి మీకు ధనం చేతికి అందుతుంది. అన్ని రకాల వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చేసే పనులను నిదానంగానైనా పూర్తిచేస్తారు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మిత్రుల వల్ల ఇబ్బందులు పడుతారు. ప్రయాణ కష్టాలు. ఆప్పుల కోసం ప్రయత్నం. మహిళలకు పనిభారం పెరగుతుంది. శ్రీసూక్తంతో అమ్మవారి పూజ చేయించండి శుభఫలితాలు వస్తాయి.

మీన రాశి ఫలాలు : ఇంట్లో శుభకార్యలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెడుతారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. అన్నదమ్ములు, అక్కచెల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల మనఃశాంతి లభిస్తుంది. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. మహిళలకు ఏదో ఒక లాభం కలుగుతుంది. శ్రీ విష్ణు ఆరాధన చేయండి చాలా మంచి ఫలితాలు సాధిస్తారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి