Zodiac Signs : జూన్ 04 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : జూన్  04 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :3 June 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : మీరు ఆశించిన విధంగా ఈరోజు గడుస్తుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటా, బయటా అనుకూలంగా ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకున్న విధంగా పనులు ముందుకుసాగవు. ధైర్యంతో చేసిన పనులలో విజయం సాధిస్తారు. రుణ బాధలు తీరుతాయి. మహిళలకు లాభాలు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.

మిథునరాశి ఫలాలు : అనుకోని విధంగా నష్టాలు వస్తాయి. అనారోగ్య సూచన. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రుణ బాధలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి మంచి ఫలితం వస్తుంది.  కర్కాటకరాశి ఫలాలు : కుటుంబంలో సానుకూలమైన మార్పులు. కొంచెం శ్రమించాల్సిన రోజు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. పెద్దల సలహాలతో ముందుకు పోతారు. మంచి ఆహారం, గౌరవం లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope May 04 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 04 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ఇబ్బందులతో కూడిన రోజు. ఆర్థికంగా మందగమనం. మిత్రులతో ఇబ్బందులు. చేసే పనులలో ఆటంకాలు. పని భారం బాగా పెరుగుతుంది. వాహనాలను జాగ్రత్తగా నడపాల్సిన రోజు. ఆంజనేయస్వామికి తమలపాకులతో పూజ చేయించండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబంలో సానుకూలమైన మార్పులు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. అన్నదమ్ముల నుంచి వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొంచెం లాభాలతో ముందుకపోతారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరగడంతో మీక సంతృప్తి ఉండదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతం నుంచి వచ్చే వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : విద్య, ధనం విషయంలో అనుకూలత కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు పలిస్తాయి. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో అనుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి.

మకరరాశి ఫలాలు : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు వచ్చినా వాటిని అధిగమిస్తారు. మిత్రుల కలయికతో సంతోషం. క్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. కొత్త పెట్టుబడులకు అవకాశం లేదు. పెట్టినా ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని వివాదాలు వస్తాయి. శ్రీ అలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, విద్యా ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. మంచి ఆలోచనలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మీరుచేసిన పనికి తగ్గ పలితాలు వస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి