Home » Devotional » Today Horoscope March 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 16 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 15, 2022, 10:40 pm
Advertisement

మేషరాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది ఈరోజు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో మార్పులు వస్తాయి. వ్యాపారాలలో చికాకులు. మహిళలకు అనారోగ్య సూచనలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ధన సంబంధ లాభాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. శ్రీ లక్ష్మీగణపతి చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : మీ పనులలో జాప్యం పెరుగుతుంది. ఇంటా, బయటా అనుకోని చికాకులు పెరుగుతాయి. కుటుంబ సంబంధ విషయాలలో పెద్దల జోక్యం పెరుగుతుంది. అనవసర వివాదాలు వచ్చే ఆస్కారం ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలలో ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

Today Horoscope march 16 2022 check your zodiac signs

Advertisement

సింహరాశి ఫలాలు : మీరు చేస్తున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అవసరాల కోసం రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటా, బయటా పరిస్థితి నిరాశపూరితంగా ఉంటుంది. శ్రీ దత్తత్రేయ కవచం పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆశించిన దానికంటే ఈరోజు మెరుగ్గా కనిపిస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. తల్లి తరుపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎర్ర వత్తులతో దీపారాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : చక్కటి వాతావరణంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. చాలా కాలంగా ఉన్న ధన సంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని వ్యవహారాల ద్వారా నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అనుకోని మార్పులు. మహిళలకు చికాకులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : బాగా పని వత్తిడితో రోజు గడుస్తుంది. అనుకోని నష్టాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇబ్బంది. ఆర్థిక మందగమనం. మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మంచి సమాచారం అందుతుంది. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. మహిళలకు ధనలాభ సూచనలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మంచి ఫలితాలతో ఉత్సాహంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూలమైన వాతావరణంలో గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కొంత నిరాశ కలిగించే స్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా మందగమనం. ఇంటా, బయటా మీకు అనుకోని వత్తిడి, పనిభారం పెరుగుతుంది. వ్యాపారాలు జాగ్రత్తగా నిర్వహించండి. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. మహిలలకు చికాకులు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి