Home » Devotional » Today Horoscope March 30 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మార్చి 30 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 29, 2022, 10:44 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభపలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తిగా ఉంటాయి. అనుకోని లాభాలు. మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. ఆనుకోని చోట నుంచి మంచి వార్తలు వింటారు. కుటుంబంలో చికాకలు తొలిగిపోతాయి. ప్రేమికులకు అనుకూలమైన రోజు. సంతానం వల్ల ప్రయోజనాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : మీకు కొంచెం శ్రమతో కూడిన రోజు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. అన్నదమ్ముల నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. మిత్రుల సహకారంతో ముందుకువెళ్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి, ఆనందంగా ఈరోజ గడుపుతారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా శుభదినం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope march 30 2022 check your zodiac signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఆనందకరమైన రోజు. ఆక్కచెల్లల నుంచి శుభవార్తాలు వింటారు. ప్రేమికుల మధ్య సఖ్యత మరింత పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలు అనకూలంగా ఉంటాయి. మహిళలకు శుభదినం. శ్రీ అర్క గణపతిని ఆరాధించండి.

కన్య రాశి ఫలాలు : ఇంట్లో శుభకార్య ప్రయత్నం చేస్తారు. చాలా కాలంగా అగిపోయిన పనులు/విషయాలలో కదలిక వస్తుంది. తల్లి తరపు వారి నుంచి శుభవార్తలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ గణేష స్తోత్రం చదువుకోండి లేదా వినండి.

Advertisement

తులారాశి ఫలాలు : మీరు బాగా కష్టపడాల్సిన రోజు. తెలివితేటలకు పని చేప్పాల్సిన సమయం. ధైర్యంతో పనులు చేయండి ఈరోజు తప్పక విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు శుభం. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడు కలసిన రోజు. ఆర్థికంగా మందగమనం. అనవసర వివాదాలు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు శ్రమించి విజయాన్ని సాధిస్తారు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సాయంత్రం అందే వార్త ఇంట్లో అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. విజయ పరంపర కొనసాగే రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మీరు ధైర్యంతో ముందుకు నడవాల్సిన రోజు. కుటుంబంలో అందరి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన రోజు. ఆర్థిక విషయలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాల్సిన రోజు. మహిళలకు శుభ వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మంచి నిర్ణయాలతో ముందుకుపోతారు. అనుకోని చోట నుంచి శుభవార్త శ్రవణం. అనుకూలమైన రోజు. విద్యా, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రేమికులు జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు. శ్రీ కృష్ణ ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మీకు కష్టాలు రావచ్చు. కానీ ధైర్యంతో ముందుకు పోవాల్సిన రోజు. అనుకోని ఖర్చులు. ప్రతి పనిలోనూ జాప్యం. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. స్త్రీ మూలకంగా వివాదాలకు అవకాశం కనిపిస్తుంది. శ్రీ ఆంజనేయాస్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి