Home » Devotional » Today Horoscope November 16 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : నవంబర్ 16 బుధవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 15, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : కొద్దిగా సంతోషం, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీస్లో పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంతో ముందడుగు వేయాలి. అనుకోని ఖర్చులు. దూర ప్రాంతం నుంచి బంధువుల రాక. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ గణపతి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు ఏర్పడుతాయి. మీ తెలివితేటలకు పని చెప్పాల్సిన రోజు. పనులలో జాప్యం తగ్గుతుంది. అన్నింటా మీకు శుభకరంగా ఉంటుంది. ఆఫీస్లో మీకు ప్రశంసలు లభిస్తాయి. మహిళలకు ధనలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : మీరు చక్కటి శుభఫలితాలను పొందుతారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మహిళలకు స్వర్ణలాభాలు. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. సాయంత్రం నుంచి శుభకరంగా ఉంటుంది. అన్ని పనులను సకాలంలో పూర్తిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

Today Horoscope November 16 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : కష్టపడాల్సినరోజు. ఆయినా అధైర్య పడాల్సిన పని లేదు. మీ ధైర్యం మిముల్ని ముందుకు తీసుకపోతుంది. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. అన్నింటా మీకు చికాకులు పెరుగుతాయి. ప్రయాణ సూచన. మహిళలకు మాట పట్టింపులు. శ్రీ కాలభైరావాష్టకం చదవండి.

కన్య రాశి ఫలాలు : ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. ఆనందంగా ఈరోజును గడుపుతారు. కుటుంబంలో సహకారం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్నయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి రోజు. మహిళలకు చక్కటి వార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఆటంకాలతో ప్రారంభం. ఆదాయంలో తగ్గుదల, వ్యాపారలలో స్వల్ప నష్టాలకు అవకాశం ఉంది. ప్రయాణంలో ఆటంకాలు, చికాకులు పెరుగుతాయి. మిత్రలతో జాగ్రత్తగా ఉండండి. మహిళలకు వంటింట్లో జాగ్రత్తలు తప్పనిసరి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : సాయంత్రం కల్లా మీకు శుభవార్త ఉంటారు. ఆటంకాలు ఎదురైనా పనులును పూర్తిచేస్తారు. ఆదాయంలో వృద్ది, అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సంతోషం, పిల్లల ద్వారా విజయాలు సాధిస్తారు. మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. మానసిక ఆందోళన పెరగుతుంది. కుటుంబంలో అనైక్యత. విజయాల కోసం బాగా శ్రమించాల్సి రోజు. ఆదాయంలో తగ్గుదల,. ప్రయాణ నష్టాలు. మహిళలకు చికాకులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయినా భయపడాల్సిన పని లేదు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అన్నదమ్ముల నుంచి వత్తిడులు, ఆదాయం తగ్గుదల, శారీరక బడలిక, అనారోగ్య సూచన, ప్రయాణ బాధలు, మహిళలకు పనివత్తిడి. శ్రీ శివాభిషకం చేయిండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీరు అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. అన్నింటా మీకు జయం. ఆదాయంలో వృద్ది, సమాజంలో మంచి పేరు, గౌరవ మర్యాదలు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్లు, ట్రేడింగ్ అనుకూలం. ఇష్టదేవతరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మంచిరోజు, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత, సంతోషం. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ధనలాభాలు వచ్చే సూచన ఉంది. అన్ని రకాలుగా బాగుంటుంది. గోసేవ చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి