Home » Devotional » Today Horoscope October 26 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 26 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 25, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరాశివారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులలో జాప్యం పెరుగుతుంది.ఆర్థికంగా సాధారణ ఫలితాలు. వ్యాపారాలలో మాత్రం స్వల్ప లాభాలు. అనుకోని ప్రయాణాలు. మహిళలకు పనివత్తిడి, ఆర్థికంగా మందగమనం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : చక్కటి శుభదినం. చేసే పనులలో వేగంగా పెరుగుతుంది.ఆఫీస్లో మీరు ప్రశంసలను అందుకుంటారు. ధనలాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ప్రయాణ లాభాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కొంచెం కష్టంతో కూడిన రోజు. ఆర్థికంగా మామూలుగా ఉంటుంది. పాత బకాయిలు రాక మానసిక చికాకులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో చికాకులు మొండి వైఖరితో ముందుకు పోవద్దు. మహిళలకు పనివత్తిడి పెరుగుతుంది.జ శ్రీ లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన ఫలితాలు. ధైర్యంతో ముందుకుపోతారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని ఖర్చులు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యాపారాలలో మందగమనం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope October 26 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చక్కటి శుభదినం. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. కుటుంబం నుంచి సహయసహకారాలు అందుతాయి. మహిళలకు ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు పడుతారు. కానీ రోజు గడిచే కొద్ది ఫలితాలు అనకూలంగా మారుతాయి. ఆర్థికంగా సాధారణ స్తితి. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. ఆఫీస్లో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ దేవి దగ్గర దీపారాధన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : కొద్దిగా కష్టపడాల్సిన రోజు. అన్ని రకాల వ్యాపారాలు నిమ్మదిస్తాయి. ఆచితూచి మాట్లాడాల్సిన రోజు.కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. వివాదాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీ రామ తారకాన్ని జపించండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో, భారంతో కూడిన రోజు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. కొత్త పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండండి. ప్రయాణ సూచన. మహిళలకు పనిభారం. అపదోద్దార స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : చక్కటి శుభ ఫలితాలతో కూడిన రోజు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. చక్కటి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. అన్నదమ్ముల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. మహిళలకు మంచిరోజు. గోసేవ చేయండి.

మకర రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో చక్కటి మార్కులు జరుగుతాయి. విజయం సాధిస్తారు. అభివృద్ధి బాటలో పయనిస్తారు. మహిళలకు ధన లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలలో చక్కటి లాభాలు. ఆదాయం మాత్రం తగ్గుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మహిలలకు అనుకోని వివాదాలకు ఆస్కారం. శ్రీ కాలభైరావాష్టపం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేయలేరు. మానసిక వత్తిడి పెరుగుతుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అన్నదమ్ముల నుంచి సహకారం లభించదు. వివాహ ప్రయత్నాలు పెద్దగా పలించవు. మహిళలకు ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి