Home » Devotional » Today Horoscope October 28 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : అక్టోబర్ 28 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 27, 2022, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : అన్నింటా మీకు జయం చేకూరుతుంది. పనులలో ఇబ్బందులు తొలిగిపోతాయి. కుటుంబంలో సానుకూల మార్పులు. ఆర్థికంగా పర్వాలేదు. ఇష్టమైన వారి నుంచి ఫోన్ కాల్ రావడం మీకు సంతోషం కలిగిస్తుంది. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయంలోపురోగతి కనిపిస్తుంది. అనుకున్న విధంగా అన్ని పనులు సాఫీగా సాగుతాయి. చక్కటి శుభవార్తలు వింటారు. మహిళలకు ధనలాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది కరమైన రోజు. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు వస్తాయి. ఆనుకోని ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో చికాకులు వస్తాయి. మహిళలకు మంచిరోజు. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి సంతోషకరమైన పరిస్థితులు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. అన్నింటా మీకు సానుకూలమైన ఫలితాలు. విద్యా, ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ దుర్గా స్తోత్రం పారాయణం చేయండి.

Today Horoscope October 28 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చక్కటి విజయాలను సాధిస్తారు. అన్నింటా శ్రమతో కూడిన విజయాలను సాధిస్తారు. మిత్రులతో ప్రయోజనాలు పొందుతారు. పెద్దల ద్వారా కీలక విషయాలు తెలుసుకుంటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. ఆదాయం కోసం ప్రత్యేక దృష్టి పెడుతారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. బంధు, మిత్రులతో విబేధాలు వస్తాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది, కానీ అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ముఖ్య విషయాలలో ఇబ్బంది పడుతారు. కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. అనుకోని ఖర్చులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : కొద్దిగా సంతోషం, కొద్దిగా కష్టంతో కూడిన రోజు. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. అదాయంలో మందగమనం. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో సంతోషం. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. మంచి చేద్దామనుకున్న మీకు ఇబ్బంది ఎదురవుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచం చదువుకోండి.

ధనస్సు రాశి ఫలాలు : చక్కటి రోజు మీకు. అన్నింటా మీకు సానుకూలతలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. శ్రీ లక్ష్మీ అష్టోతరంతో అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కుటుంబంలో ఇబ్బందులు కానీ వాటిని మీరు ధైర్యంతో అధిగమిస్తారు. ఆటంకాలు వచ్చినా మీరు ముందుకుపోతారు. విద్యా, ఉపాధి విషయాలలో శ్రమించాల్సిన రోజు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీదేవి ఆరాధన చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : కొంత శ్రమతో ఎక్కువ లాభాలను గడిస్తారు, అన్ని విషయాలలో మీరు పురోగతి సాధిస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో మంచి వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. మహిళలకు ప్రయాన లాభాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మీన రాశి ఫలాలు : కుటుంబంలో మీ మాటకు విలువ ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనులను వేగంగా పూర్తిచేస్తారు. ధనలాభాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి