Home » Hyderabad » Cost Income Ghmc Certificates On Whatsapp
hyderabad

Certificates : గుడ్‌న్యూస్‌ .. ఇక పై ‘మీసేవా’ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు .. వాట్సాప్‌లోనే కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు .. !

Authored By
Suma
The Telugu News | Published on: March 11, 2026, 11:00 am
Advertisement

Certificates : హైదరాబాద్ నగరంలో కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC మ్యారేజ్, బర్త్, డెత్ వంటి వివిధ ప్రభుత్వ సర్టిఫికెట్ల కోసం రోజూ ‘మీసేవా’ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ప్రత్యేకంగా విద్యార్థులు, ఉద్యోగాల కోసం అప్లై చేసే యువత, వివిధ ప్రభుత్వ పథకాల కోసం అవసరమైన డాక్యుమెంట్ల కోసం గంటల తరబడి తిరగాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం తాజాగా వాట్సాప్ ఆధారిత ‘మీసేవా’ సేవను ప్రారంభించింది. ప్రజలు తమ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపితే వెంటనే అందుబాటులో ఉన్న సర్టిఫికెట్ల జాబితా కనిపిస్తుంది. అందులో నుంచి అవసరమైన సర్టిఫికెట్‌ను ఎంపిక చేసుకుని నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది.

Advertisement

Certificates : గుడ్‌న్యూస్‌ .. ఇక పై ‘మీసేవా’ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు .. వాట్సాప్‌లోనే కాస్ట్, ఇన్‌కమ్, GHMC సర్టిఫికెట్లు .. !

ఈ సేవ ద్వారా కాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్, EBC, OBC, మ్యారేజ్, బర్త్, డెత్ వంటి పలు ముఖ్యమైన సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం సాధారణంగా సర్టిఫికెట్ జారీకి సుమారు 7 రోజుల ప్రాసెసింగ్ టైమ్ ఉంటుంది. సమ్మర్ సెలవులు ముగిసిన తర్వాత కాలేజీల్లో అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, ఇతర అకడమిక్ అవసరాల కోసం విద్యార్థులకు ఈ సర్టిఫికెట్లు అత్యవసరం అవుతాయి. ఇలాంటి సమయంలో వాట్సాప్ ద్వారా ఇంటి దగ్గర నుంచే అప్లై చేసుకునే సదుపాయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. దీంతో మీసేవా కేంద్రాల వద్ద రద్దీ కూడా తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి