Uppal : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై పరమేశ్వర్‌రెడ్డి ఫోకస్.. కీలక పనులకు నిధుల విజ్ఞప్తి
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా, మల్లాపూర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్‌లు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఎంఎంసీ కమిషనర్‌ను కోరారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా, మల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డిని కోరారు. స్థానిక కాలనీవాసులతో కలిసి బుధవారం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన ఆయన, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ జోన్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో అత్యవసర అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే రహదారి అనుసంధానం మెరుగుపడటంతో పాటు రోడ్డు భద్రత పెరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పరమేశ్వర్‌రెడ్డి వివరించారు. వినతిపత్రంపై ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Uppal : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిపై పరమేశ్వర్‌రెడ్డి ఫోకస్.. కీలక పనులకు నిధుల విజ్ఞప్తి
Uppal కాప్రా డివిజన్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు
కాప్రా డివిజన్‌లో పలు కీలక మౌలిక వసతుల పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో గాంధీనగర్ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, నాయక్‌నగర్–బంజారా కాలనీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, సాయిబాబా నగర్ ‘సి’ కాలనీలో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఉన్నాయి. అదేవిధంగా సాయిబాబా నగర్ మసీదు రోడ్డు నుంచి డబుల్ బెడ్‌రూమ్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం, గాంధీనగర్ రేషన్ షాప్ నుంచి హెచ్.నెం. 1-1-159/4 నుంచి 1-1-160 వరకు సీసీ రోడ్డు వేయాలని కోరారు. వంపుగూడలో ఐఓబీ బ్యాంక్ లేన్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, వీఐపీ గోదాం నుంచి వంపుగూడ ప్రధాన రహదారి వరకు సీసీ రోడ్డు నిర్మాణం కూడా ప్రతిపాదనల్లో చోటు దక్కించుకున్నాయి.యాదవ్ బస్తీ, కాప్రాలో సీసీ రోడ్డు నిర్మాణం, న్యూ గాంధీనగర్‌లో సీఎఏఎల్ పబ్లిక్ స్కూల్ లేన్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.అదనంగా సాయిబాబా నగర్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు, ఎల్లారెడ్డిగూడలో కల్వర్టు నిర్మాణం వంటి ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు.
Uppal మల్లాపూర్ డివిజన్‌లో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్‌కు ప్రతిపాదనలు
మల్లాపూర్ డివిజన్ పరిధిలో లక్ష్మీనగర్ కమ్యూనిటీ హాల్, న్యూ నరసింహ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని పరమేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే పిట్టల బస్తీలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందడంతో పాటు కాలనీల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, కుషాయిగూడ డివిజన్ అధ్యక్షుడు కాకుంట్ల కౌకుట్ల ప్రకాష్‌రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు శ్రీహరి, వంపుగూడ డివిజన్ అధ్యక్షుడు టిల్లు యాదవ్, జిల్లా కార్యదర్శి మారులి, మాజీ డివిజన్ అధ్యక్షుడు కోబారి నాగశేషు, నాగరాజు, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షురాలు జెమిలా బేగం, మాజీ అధ్యక్షుడు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్, టిల్లు ముదిరాజ్, కాలనీవాసులు కబీర్ భాయ్, భూక్యా నాయక్, శేషాద్రి, లక్ష్మణ్, వేణు, నాగరాజు, మహేష్, సాయి కాలనీకి చెందిన పలువురు స్థానికులు పాల్గొన్నారు.







