Home » Hyderabad » Daughter Who Killed Her Mother
hyderabad

Jawahar Nagar : ప్రేమ మోజులో కన్నతల్లిని హతమార్చిన కూతురు .. ఇంట్లోనే పూడ్చిపెట్టి దారుణం..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 25, 2026, 6:19 pm
Advertisement

Jawahar Nagar : సికింద్రాబాద్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి ప్రేమను పక్కనబెట్టి, ప్రియుడితో కలిసి జీవించాలనే ఆశతో ఓ యువతి తన తల్లినే హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణం కౌకూర్ భరత్‌నగర్‌లో చోటుచేసుకోగా దాదాపు 10 నెలల తరువాత అసలు విషయం బయటపడింది. వివరాల ప్రకారం అంజు అనే మహిళ అనూహ్యంగా అదృశ్యమవడంతో ఆమె పెద్ద కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాలు సేకరించినప్పటికీ మొదట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసు క్లిష్టంగా మారడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

Advertisement

Daughter who killed her mother

ఈ క్రమంలో పోలీసులు అంజు చిన్న కూతురు ఇషికను అనుమానంతో మళ్లీ విచారించారు. మొదట తిరస్కరించిన ఆమె చివరికి ఒత్తిడికి లోనై అసలు నిజాన్ని బయటపెట్టింది. తన తల్లిని తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ హత్యలో తన ప్రియుడు మౌంటీరాజ్ కూడా సహకరించినట్లు తెలిపింది. ఇషిక మరియు మౌంటీరాజ్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగా వారు సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి అంజు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కారణంగా తల్లి తమకు అడ్డుగా ఉందని భావించిన ఇషిక ఆమెను తొలగించాలని పథకం రచించింది. ప్రియుడితో కలిసి ముందస్తు ప్రణాళిక ప్రకారం అంజును హతమార్చారు. హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి ప్రాంగణంలోనే గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసే చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కౌకూర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి