Home » Hyderabad » Elderly Man Dies Before Century Celebrations
hyderabad

Medchal : వృద్ధుడికి 100 ఏళ్లు జన్మదిన వేడుకలు .. ఆలోపే అనుకోని ఘటన

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 27, 2026, 12:49 pm
Advertisement

Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు నిర్వహించాలని సిద్ధమయ్యారు. అయితే ఆనందోత్సాహాల మధ్య విషాదం చోటుచేసుకుంది. బీదర్ కు చెందిన దొండచార్య జోషి (100) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల వరకు ఆయన బోడుప్పల్ లోని గాయత్రినగర్ ప్రాంతంలో నివసిస్తూ వచ్చారు. దొండచార్య జోషి స్వాతంత్ర్యానంతర కాలంలో సామాజిక చైతన్యంతో గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలిచారు. బీదర్ హైదరాబాదు సంస్థాన పరిధిలో ఉన్న రోజుల్లో రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన ధైర్యంగా స్వరం వినిపించారు. అన్యాయాలపై తిరుగుబాటు స్వభావంతో ముందుండి పోరాటాల్లో పాల్గొన్నారని కుటుంబ సభ్యులు స్మరించుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల విభజన సమయంలో జరిగిన ఉద్యమాలలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు.

Advertisement

Medchal : వృద్ధుడికి 100 ఏళ్లు జన్మదిన వేడుకలు .. ఆలోపే అనుకోని ఘటన

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ ముందుండేవారని పరిచయస్తులు చెబుతున్నారు. గత ఏడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో ఆయన 99వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో అనేక మంది ప్రముఖులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలను కుటుంబ సభ్యులు మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్వాన పత్రికలు పంపిస్తూ బంధుమిత్రులను ఆహ్వానించాలనే యోచనలో ఉండగానే ఆయన మృతి చెందడం అందరినీ విషాదంలో ముంచింది. శతాయుష్మంతుడిగా జీవించిన దొండచార్య జోషి జీవితం నేటి తరాలకు ప్రేరణగా నిలుస్తుందని స్థానికులు పేర్కొన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శతాబ్ది వేడుకలు జరగాల్సిన రోజునే ఆయన జ్ఞాపకార్థం స్మారక సభ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి