
Free medical camp organized in Uppal
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని బీరప్ప గడ్డ డివిజన్‌లో సామాజిక సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. నేర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ అధినేత నేర్ధం భాస్కర్ గౌడ్ నాయకత్వంలో ఉచిత కంటి పరీక్షలు మరియు హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని నిరుపేదల కోసం నిర్వహిస్తున్న ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిజంగా పేదల పాలిట వరమని అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Uppal : ఉప్పల్.. నేర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేర్ధం భాస్కర్ గౌడ్ సేవా తపన ప్రశంసనీయమని ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవే నిజమైన సేవ అని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, అంజయ్యతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఈ శిబిరానికి మంచి స్పందన ఇచ్చారు. అనేక మంది కంటి పరీక్షలు చేయించుకొని, హోమియోపతి వైద్యుల సలహాలు తీసుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను మరింత బలపరిచినట్టైంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.