Home » Business » Success Story Of Woman Farmer Bharti Poharkar Earned Rs 7 Lakh Profit 1 Acre Santra Farming
Business

Success Story of Woman : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 26, 2026 1:19 pm
Advertisement

Success Story of Woman –  Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యవసాయం పండుగ అని నిరూపించారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. భారీ వర్షాలకు చుట్టుపక్కల రైతుల పంటలన్నీ దెబ్బతిన్నా, ఆమె తోట మాత్రం పచ్చగా కళకళలాడింది. కేవలం ఒక ఎకరం 4 గుంటల భూమిలో ఆరెంజ్ Nagpur Santra సాగు చేసి ఏకంగా రూ.7 లక్షల లాభం గడించి అందరికీ ఆదర్శంగా నిలిచారు 38 ఏళ్ల భారతి అరుణ్‌రావు పోహోర్కర్.

Advertisement

Success Story of Woman : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు..!

Success Story of Woman  Bharti Pohorkar ఆఫీస్ జాబ్ వదిలి.. వ్యవసాయం వైపు..

భారతిది అమరావతి జిల్లాలోని చందూర్ బజార్ తాలూకా కరజ్‌గావ్ గ్రామం. ఆమె MCom చదివి మొదట్లో పార్ట్ టైమ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. కానీ, ఆఫీస్ పని ద్వారా వచ్చే జీతం తమ పొలంలో కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని గ్రహించారు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి, తన 68 ఏళ్ల తల్లి సుమిత్రతో కలిసి పూర్తిస్థాయిలో వ్యవసాయం బాధ్యతలు స్వీకరించారు. విదర్భ ప్రాంతంలో మహిళలు ఇలా ఒంటరిగా వ్యవసాయం చేయడం చాలా అరుదు.

Advertisement

Success Story of Bharti Pohorkar ఒక ఎకరంలో 180 మొక్కలు

భారతి తనకున్న కొద్దిపాటి భూమిలో 180 రంగ్‌పురి నాగ్‌పూర్ సంత్ర Rangpuri Nagpur Santra అంటుకట్టిన మొక్కలను నాటారు. చెట్లు పెరిగే లోపు, ఆదాయం కోసం ఉల్లిపాయలను అంతరపంటగా సాగు చేశారు. కూలీల కొరత ఉన్నప్పటికీ కలుపు తీయడం, నీరు పెట్టడం, మందులు పిచికారీ చేయడం వంటి పనులన్నీ స్వయంగా తానే చూసుకున్నారు.

“మొదట్లో ఇదంతా ఆడవాళ్ల వల్ల అయ్యే పని కాదని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు నా చెట్లే వారికి సమాధానం చెబుతున్నాయి” అని భారతి గర్వంగా చెబుతారు. ఆమె కృషికి గుర్తింపుగా 2023లో ‘ఉత్తమ యువ మహిళా రైతు’ అవార్డు కూడా దక్కింది.

Advertisement

శాస్త్రీయ పద్ధతులే విజయ రహస్యం

సాధారణంగా నాగ్ పూర్ సంత్ర చెట్లు ఒక ఏడాది విపరీతంగా కాపు కాస్తే, మరుసటి ఏడాది Alternate bearing దిగుబడి తగ్గిపోతుంది. దీనికి సరైన నీటిని మేనేజ్ చేయడం, ప్రూనింగ్ (కొమ్మలు కత్తిరించడం) లేకపోవడమే కారణం. భారతి ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కొన్నారు.

Success Story of Bharti Pohorkar : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం: ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు

చెట్లకు బేసిన్ ఇరిగేషన్ పద్ధతిలో నేరుగా వేర్లకే నీరు అందేలా చేశారు. మొక్కల దశలో తరచుగా, పెద్ద చెట్లకు 7-10 రోజులకు ఒకసారి నీరు అందించారు. పూత వచ్చే సమయంలో మాత్రమే నీటి ఎద్దడి సృష్టించి సరైన సమయంలో పూత వచ్చేలా జాగ్రత్తపడ్డారు. ఒకేసారి కాకుండా దఫదఫాలుగా పోషకాలు అందించారు. ఎక్కువ పూత, బలహీనమైన కాయలను తెంపేయడం ద్వారా చెట్టు బలాన్ని కాపాడారు.

తెగుళ్ల నివారణకు బంతిపూల వనం..

రసాయనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన పద్ధతులను భారతి ఎంచుకున్నారు. సంత్ర చెట్ల వరుసల మధ్య బంతి పూల Marigolds మొక్కలను పెంచారు. బంతి మొక్కల వేర్ల నుంచి వచ్చే సమ్మేళనాలు నేలలోని నెమటోడ్ (నులిపురుగులు) తెగుళ్లను నాశనం చేస్తాయి. అలాగే బంతిపూల అమ్మకం ద్వారా అదనపు ఆదాయం కూడా వచ్చింది. పండు ఈగలను Fruit flies ఆకర్షించి చంపేందుకు పసుపు రంగు జిగురు అట్టలను Yellow sticky traps, సోలార్ లైట్ ట్రాప్స్ ను ఉపయోగించారు. కాండం కుళ్లు తెగులు రాకుండా చెట్ల మొదళ్లకు బోర్డోక్స్ పేస్ట్ పూశారు.

Advertisement

సమస్యాత్మక వాతావరణంలోనూ, గతేడాది కేవలం 7 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా 15 టన్నుల నాణ్యమైన సంత్ర కాయలను పండించారు భారతి. వాతావరణం అనుకూలించకపోయినా, శాస్త్రీయ పరిజ్ఞానం, సహనం, నేలతో మమేకమై పనిచేస్తే ఎంతటి కష్టనష్టాలనైనా అధిగమించి లాభాలు సాధించవచ్చని భారతి పోహోర్కర్ నిరూపించారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి