Home » Jobs Education » 5349 Jobs In Railways 206
Jobs Education

Railway Jobs : యువతకు బంపర్ ఆఫర్ .. రాత పరీక్ష లేదు .. ఇంటర్వ్యూ లేదు .. రైల్వేలో 5,349 ఉద్యోగాలు

Authored By
Suma
The Telugu News | Updated on: February 21, 2026, 8:30 pm
Advertisement

Railway Jobs  : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railways కి చెందిన వెస్ట్రన్ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. వెస్ట్రన్ రైల్వే పరిధిలో మొత్తం 5,349 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా రైల్వేల్లో శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలను అందించే ఈ నోటిఫికేషన్ యువతలో ఉత్సాహాన్ని నింపుతోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు Railway Recruitment Cell Western Railway అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. చివరి తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Railway Jobs : యువతకు బంపర్ ఆఫర్ .. రాత పరీక్ష లేదు .. ఇంటర్వ్యూ లేదు .. రైల్వేలో 5,349 ఉద్యోగాలు

Railway Jobs : అర్హతలు, వయస్సు పరిమితి

ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCVT/SCVT) పొందిన వారు మాత్రమే అర్హులు. వయస్సు పరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు వంటి వర్గాలకు వయస్సు పరిమితిలో రాయితీలు వర్తిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమ అర్హతలను సరిచూసుకోవడం అవసరం.

Advertisement

Railway Jobs : ఎంపిక విధానం .. ఫీజు వివరాలు

ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. కాబట్టి విద్యార్హతల్లో మంచి మార్కులు సాధించిన వారికి ఇది మంచి అవకాశం. దరఖాస్తు ఫీజు సాధారణ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. ఫీజు కూడా ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.

Western Railway : సికింద్రాబాద్ జోన్‌లో 1,012 పోస్టులు

ఇక దక్షిణ మధ్య రైల్వే లోని సికింద్రాబాద్ జోన్ పరిధిలోనే 1,012 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. రైల్వే రంగంలో శిక్షణ పొందాలని ఆశిస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశం. శిక్షణ అనంతరం భవిష్యత్తులో రైల్వే లేదా ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ అనుభవం ఉపయోగపడుతుంది. భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి