Home » Khammam » Khammam Muncipal Commissioner Met Minister Puvvaja Ajay
khammam

Khammam..మంత్రి అజయ్‌తో కమిషనర్ మర్యాదపూర్వక భేటీ

Authored By
praveen T
The Telugu News | Published on: September 21, 2021, 11:26 am
Advertisement

ఖమ్మం నగర మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ఆదర్శ్ సురభి సోమవారం రాత్రి జిల్లాలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌజ్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను కమిషనర్ మున్సిపాలిటీ గురించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ములుగు డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, బదిలీపై ఆదర్శ్ సురభి ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనతో భేటీ అయ్యారు. నూతన మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి పువ్వాడ అజయ్ శాలువాతో సత్కరించారు.

Advertisement

ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఇకపోతే నూతన కమిషనర్‌కు మున్సిపల్ అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి