Home » National » Central Govt Plans A New Change In The Ration Supply System
National

Ration Card : రేషన్ సరఫరా విధానంలో కొత్త మార్పు .. నేరుగా ఖాతాలోకి డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

Authored By
Suma
The Telugu News | Updated on: February 7, 2026 1:37 pm
Advertisement

Ration Card : దేశవ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం  central government రేషన్ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం Free rice , గోధుమలు  wheat  అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంప్రదాయ విధానానికి స్వస్తి పలికి మరింత పారదర్శకతతో కూడిన కొత్త వ్యవస్థను  new system అమలు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఇకపై సరుకుల బదులు నేరుగా నగదు అందించే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు కావలసిన ఆహార పదార్థాలను తామే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు వంటి సరుకులు పంపిణీ అవుతున్నాయి. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులను వినియోగించకుండా మార్కెట్లో విక్రయించడం లేదా పూర్తిగా తీసుకోకపోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగదు బదిలీ విధానం Money transfer procedure ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కేంద్రం ఆశిస్తోంది.

Advertisement

Ration Card : రేషన్ సరఫరా విధానంలో కొత్త మార్పు .. నేరుగా ఖాతాలోకి డ‌బ్బులు.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

Ration Card : పైలట్ ప్రాజెక్ట్ విజయంతో పూర్తి అమలుకు సిద్ధం

ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో నగదు బదిలీ పైలట్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. అక్కడ లబ్ధిదారుల నుంచి సానుకూల స్పందన రావడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అమలుపై దృష్టి సారించింది. ఈ విధానంలో భాగంగా ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో రేషన్ షాపులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి లబ్ధిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం మరింత ఉపయోగకరంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Ration Card : ఈ-రూపీ వోచర్‌తో నకిలీ కార్డులకు చెక్

కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ‘ఈ-రూపీ’ అనే డిజిటల్ వోచర్  ‘e-Rupee’ digital voucher వ్యవస్థను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్‌కు ప్రతినెలా ఈ వోచర్ రూపంలో నగదు విలువ పంపించనున్నారు. ఈ వోచర్‌ను రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు కొనుగోలు చేసేందుకు లేదా అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యం నకిలీ మరియు డుప్లికేట్ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించడమే. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76 వేలకుపైగా డుప్లికేట్ కార్డులను గుర్తించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నగదు బదిలీ విధానం అమలులోకి వస్తే బ్లాక్ మార్కెట్ లావాదేవీలకు పూర్తిగా చెక్ పడుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ మార్పు ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చడంతో పాటు రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

Advertisement

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి