Home » National » Gas Cylinder Booking Offer On Paytm
National

Paytm Gas Cylinder Offer : వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే రూ.200 క్యాష్‌బ్యాక్.. అస్సలు మిస్సవకండి!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 3, 2026 11:40 am
Advertisement

Paytm Gas Cylinder Offer : సామాన్యుడి జేబుకు ప్రతి నెలా చిల్లులు పడుతున్న రోజులివి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు మండిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ముఖ్యంగా వంట గ్యాస్ LPG Gas Cylinder ధరలు సామాన్యులకు భారంగానే మారాయి. ఇటీవల ఏప్రిల్ 1వ తేదీ నుంచి కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ల ధరలు ఏకంగా రూ.200 మేర పెరిగిన విషయం తెలిసిందే. గృహ వినియోగ గ్యాస్ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, ప్రస్తుతం ఉన్న ధరలు కూడా సామాన్యులకు భయంగానే ఉన్నాయి. ఇలాంటి కష్టకాలంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’ Paytm సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

Paytm Gas Cylinder Offer : వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే రూ.200 క్యాష్‌బ్యాక్.. అస్సలు మిస్సవకండి!

మీరు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే ఆఫ్‌లైన్‌లో లేదా గ్యాస్ ఏజెన్సీల యాప్స్ ద్వారా బుక్ చేసే బదులు, పేటీఎం Paytm ద్వారా ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే ఏకంగా రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ Cashback పొందే అద్భుతమైన అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ ఎలా చేయాలి? ప్రోమో కోడ్ ఏంటి? అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..

Advertisement

Paytm Gas Cylinder Offer : ఏయే గ్యాస్ కనెక్షన్లకు వర్తిస్తుంది?

ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం ఒక పర్టిక్యులర్ గ్యాస్ కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. మీరు భారత్ గ్యాస్ Bharat Gas, హెచ్‌పీ గ్యాస్ HP Gas, లేదా ఇండేన్ Indane Gas.. ఇలా ఏ కంపెనీకి చెందిన ఎల్‌పీజీ LPG సిలిండర్ వాడుతున్నా సరే, పేటీఎం ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఈ లబ్ధిని పొందవచ్చు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా చిటికెలో గ్యాస్ బుక్ చేసుకోవడమే కాకుండా.. డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు.

Paytm Gas Cylinder Offer : రూ.200 క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలి? Step by Step Guide

ఈ క్యాష్‌బ్యాక్ పొందడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కింద తెలిపిన విధంగా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.

Advertisement

Paytm యాప్ ఓపెన్ చేయండి: ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న పేటీఎం Paytm యాప్‌ను అప్‌డేట్ చేసి, ఓపెన్ చేయండి.

గ్యాస్ బుకింగ్ ఆప్షన్: యాప్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే ‘Recharge and Bill Payments’ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ విభాగంలోకి వెళ్లండి. అక్కడ మీకు ‘Book Gas Cylinder’ ‘గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

ప్రొవైడర్ ఎంపిక: తర్వాతి పేజీలో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీని HP, Indane, లేదా Bharat Gas ఎంచుకోండి.

వివరాల నమోదు: అనంతరం మీ గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయిన కస్టమర్ నంబర్ LPG ID లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. వెంటనే మీ పేరు, మీ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత బిల్లు అమౌంట్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Advertisement

ట్రిక్ ఇక్కడే ఉంది Promo Code : మీరు ‘Proceed to Pay’ బటన్ నొక్కే ముందు, కింద కనిపించే ‘Offers For You’ లేదా ‘Apply Promocode’ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ CYLWIN అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేసి అప్లై Apply చేయండి.

పేమెంట్: కోడ్ సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయిన తర్వాత, యూపీఐ UPI, వాలెట్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పూర్తి చేయండి.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు Terms and Conditions

ఏదైనా ఆఫర్ ఉందంటే దాని వెనుక కొన్ని షరతులు కచ్చితంగా ఉంటాయి. పేటీఎం కూడా ఈ ఆఫర్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. అవేంటో తెలుసుకోకుండా గుడ్డిగా బుక్ చేస్తే క్యాష్‌బ్యాక్ రాకపోవచ్చు.

లక్కీ యూజర్లకు మాత్రమే: ఈ CYLWIN ప్రోమో కోడ్ వాడిన ప్రతి ఒక్కరికీ రూ.200 రావు. పేటీఎం నిబంధనల ప్రకారం, ఈ కోడ్ ద్వారా గ్యాస్ బుక్ చేసే ప్రతి 2,000వ (2000th User) వినియోగదారుడికి ఈ రూ.200 క్యాష్‌బ్యాక్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక రకమైన లక్కీ డ్రా లాంటిదన్నమాట.

Advertisement

బ్యాంక్ అకౌంట్ లింకింగ్: మీకు క్యాష్‌బ్యాక్ వస్తే, ఆ డబ్బు నేరుగా మీ వాలెట్ లేదా ఖాతాలోకి రావాలంటే.. మీ పేటీఎం యాప్‌కు మీ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా లింక్ Paytm UPI అయి ఉండాలి.

ఒక్కసారి మాత్రమే: ఈ ఆఫర్ ఒక యూజర్‌కు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అంటే పదే పదే బుక్ చేసినా ఒకేసారి లబ్ధి చేకూరుతుంది.

పరిమిత కాల ఆఫర్: ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్. ఏ క్షణంలోనైనా ఈ ఆఫర్ ముగిసే ఛాన్స్ ఉంది.

గ్యాస్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో.. ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ బుకింగ్ తప్పనిసరి. అలాంటప్పుడు ఆఫ్‌లైన్‌లో నగదు చెల్లించే కంటే, ఇలాంటి ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ వాడటం వల్ల మన అదృష్టం బాగుంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఒకవేళ క్యాష్‌బ్యాక్ రాకపోయినా, చిల్లర సమస్య ఉండదు, పేమెంట్ హిస్టరీ భద్రంగా ఉంటుంది. కాబట్టి, ఈసారి గ్యాస్ బుక్ చేసే ముందు మీ పేటీఎం యాప్‌లో ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందో లేదో ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని, CYLWIN కోడ్ వాడి అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి