Modi : రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ‘భారత్‌శక్తి’ పేరిట యుద్ధ విన్యాసాలను ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సుమారు 50 నిమిషాల పాటు సమీకృత ట్రే-సర్వీస్ ఫైర్‌పవర్, యుక్తి విన్యాసం జరిగింది. ఈ సందర్భంగా స్వదేశీ రక్షణ పరికరాల పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఈ విన్యాసాలలో ఎల్‌సీఏ తేజస్‌తోపాటు ఎఎల్‌హెచ్ ఎంకే-4 వినువీధిలో గర్జించాయి. అలాగే ప్రధాన యుద్ద ట్యాంక్ అర్జున్, వజ్ర కె-9, ధనుష్, శరంగ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌లు భూతలంపై కాల్పుల మోత మోగించాయి. ఇక పినాకా శాటిలైట్ సిస్టమ్, డ్రోన్‌ల సమూ#హం వంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 30 దేశాల ప్రతినిధులతో కలిసి ప్రధాని ఈ విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. భారత్ శక్తి సాధన సమయంలో గగనతలంలో విమానాల గర్జన, భూమిపై కనపడే పరాక్రమం న్యూ ఇండియా శక్తికి నిదర్శనమని (నయే భారత్ కా ఆవహాన్ #హ) అన్నారు. గతంలో పోఖ్రాన్‌లో భారత్ అణుపరీక్ష నిర్వ#హంచిందని గుర్తు చేశారు. జైసల్మేర్ నగరానికి 100 కి.మీ దూరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలతో సమకాలీన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశ సంసిద్ధతకు ఈ ప్రదర్శన స్పష్టమైన సంకేతమని పీఎంవో కార్యాలయం పేర్కొంది. ‘భారత్ శక్తి’ ప్రపంచ వేదికపై భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాల స్థితిస్థాపకత, ఆవిష్కరణల బలాన్ని #హలైట్ చేస్తుందని వెల్లడించింది.
రక్షణ రంగంలో స్వావలంబన త్రివిధ దళాలలో ఆత్మవిశ్వాసం నింపింది. అగ్ని-5 క్షిపణి పరీక్ష, రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు గొప్ప ముందడుగు. గత పదేళ్లలో దేశ రక్షణ ఉత్పత్తి రెండింతలు పెరిగింది. అంటే ఇది లక్ష కోట్ల కంటే ఎక్కువ. యువత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత దశాబ్దంలో 150 డిఫెన్స్ స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. మన బలగాలు వారికి 1,800 కోట్ల విలువైన ఆర్డర్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్’ భారతదేశం బలగాలలో ‘ఆత్మవిశ్వాసాల’కి హామీ ఇస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారత్‌శక్తి విన్యాసాలలో మనం చూసిన దృశ్యాలు, మన త్రివిధ దళాల ధైర్యసా#హసాలు అద్భుతం. ఆకాశంలో గర్జన, నేలపై యుద్ధం విన్యాసాలతో విజయ ఘోష నలుదిశలా ప్రతిధ్వనిస్తుంది. ఇది నవ భారత పిలుపు. మేము భారతదేశాన్ని వికసిత్‌గా మార్చాలని అనుకుంటున్నాము, ఆపై మనం ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. అందుకే భారతదేశం వంట నూనెల నుంచి ఆధునిక విమానాల వరకు అన్ని రంగాలలో ‘ఆత్మనిర్భర్త’పై దృష్టి సారిస్తోంది అని ప్రధాని అన్నారు. మేక్ ఇన్ ఇండియా విజయం మన ముందు ఉంది. మన తుపాకులు, ట్యాంకులు, యుద్ధ నౌకలు, ##హలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థలు. ఇది ‘భారత్ శక్తి’. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, సైబర్ నుండి అంతరిక్షం వరకు అన్నింటినీ మనమే తయారు చేసుకోగలం అని ప్రధాని పేర్కొన్నారు.
నేను నా జీవితాన్ని రైల్వే ట్రాక్‌లపై ప్రారంభించాను. కాబట్టి మన రైల్వేలు ఇంతకు ముందు ఎంత అధ్వాన్నం గా ఉండేవో నాకు తెలుసు అని ప్రధాని చెప్పారు. మంగళవారం గుజరాత్‌లోని అ#హ్మదాబాద్ నగరంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన తర్వాత రూ.1,06,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. వీటిలో రూ. 85,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 10 కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం, గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ద##హజ్ వద్ద రూ. 20,600 కోట్ల పెట్టుబడితో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ‘కొందరు మా ప్రయత్నాలను ఎన్నికల దృష్టితో చూస్తున్నారు. మేము దేశాన్ని నిర్మించే లక్ష్యంలో భాగంగా అభివృద్ధి పనులను చేపడుతున్నాం. గత తరాలు అనుభవించిన బాధలు మన యువతకు కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇది మోడీ హామీ. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి గతంలో కంటే ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. ఈ సంవత్సరం రెండు నెలల వ్యవధిలోనే తమ ప్రభుత్వం 11 లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిందని ప్రధాని చెప్పారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను నిలిపివేసి, దానిని కేంద్ర బడ్జెట్‌లో చేర్చామని, తద్వారా ప్రభుత్వ సొమ్మును రైల్వేల అభివృద్ధికి వినియోగించడానికి వీలు కలిగిందన్నారు. నరకం లాంటి పరిస్థితి నుండి రైల్వేలను బయటకు తీయడానికి తమ ప్రభుత్వం బలమైన సంకల్ప శక్తిని కనబరిచిందని, ఈ రంగం అభివృద్ధి తమ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని మోడీ చెప్పారు.
పదేళ్ల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే..
10 #హస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అ#హ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, దేశాభివృద్ధికి గడిచిన 10 సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు రాజకీయ స్వార్థానికి ప్రాధాన్యత ఇచ్చాయని, భారతీయ రైల్వేలు దానికి బలయ్యాయి అని ప్రధాని అన్నారు. ఈరోజు జరిగిన ప్రారంభోత్సవాలు మీ వర్తమానం కోసమేనని యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు భరోసా అని అన్నారు. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మొత్తం 41 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తొలి వందే భారత్ రైలును 2010లో ఢిల్లిd నుంచి వారణాసికి ప్రారంభించారు.
వారసత్వ సంపదను గౌరవించని దేశానికి భవిష్యత్తు అంధకారమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ రాజధాని నగరం అ#హ్మదాబాద్ నగరంలోని సబర్మతిలో మంగళవారం రూ. 1,200 కోట్లతో గాంధీ ఆశ్రమ స్మారక మాస్టర్‌ప్లాన్‌ను మోడీ ప్రారంభించారు. 1930 మార్చి 12న మహాత్మా గాంధీ చేపట్టిన ప్రసిద్ధ దండియాత్ర (ఉప్పు యాత్ర) వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పునరుద్ధరించిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ”తన వారసత్వాన్ని గౌరవించని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుంది. సబర్మతి ఆశ్రమం దేశానికి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి వారసత్వం” అని అన్నారు. సబర్మతీ ఆశ్రమం మన స్వాతంత్య్ర ఉద్యమానికే కాకుండా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం)కి కూడా తీర్థయాత్రగా మారిందని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన ప్రభుత్వానికి సబర్మతీ ఆశ్రమం వంటి వారసత్వ ప్రదేశాలను కాపాడుకోవాలనే మనస్తత్వం, రాజకీయ సంకల్పం లేదన్నారు. విదేశీ దృష్టితో భారతదేశాన్ని చూడటం, మన వారసత్వాన్ని నాశనం చేయడానికి దారితీసిన బుజ్జగింపు రాజకీయాలే ఇందుకు కారణమని విమర్శించారు. తమ ప్రభుత్వం చేపట్టిన లోకల్ వోకల్ అనేది మహాత్మా గాంధీ ‘స్వదేశీ’ ఆలోచనకు కొనసాగింపు ప్రక్రియగా మోడీ అభివర్ణించారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.