Local Parties : శాంతికాలంలో యుద్ధమంటే అది ఎన్నికల సమయమే. ఒకప్పుడు, ఎన్నికల ముహూర్తాన్ని ఎంచుకోవడానికి పాలకులు హాస్యాస్పదంగా గ్రహస్థితులపై ఆధారపడేవారు. ఇందుకోసం దీర్ఘకాలంగా నమ్మకమైన జ్యోతిష్కుల సలహాలు, సూచనలు పాటించేవారు. వ్యాపారవేత్తలు, మార్కెట్ మావెన్లు, సైద్ధాంతిక మేధావులు వంటి ఎన్నికల పండితులు కాక్‌టెయిల్ పార్టీలలో లేదా టీవీలో తమ లక్ష్య ప్రేక్షకుల ఆకలిని పెంచడానికి నంబర్ గేమ్‌లు ఆడతారు. ఇప్పుడు కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగానే నేతల ఎదుగుదల, పతనం, గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషించడం, ఎవరికి అందలమో, ఎవరికి పరాజయమో లెక్కలు కట్టడం ప్రారంభిస్తారు. తమ అంచనాలతో ఆయా పార్టీల అభిమానులతోపాటు, రాజకీయా భిలాషులనూ ఉత్కంఠకు గురిచేస్తారు. లేనిపోని ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు చేస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎప్పటిలాగే ఈసారికూడా పరాజయ కిరీటాన్నే తగించడం ఊహించదగిన పరిణామమే. బీజేపీకి 370 సీట్లు వస్తాయని అంచనా వేసిన నరేంద్ర మోడీ ఇప్పటికే విజయాన్ని ప్రకటించుకున్నారు. మితవాద అభిప్రాయాలు, ఫోనీ పోల్‌స్టర్లు కాంగ్రెస్‌కు 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు ఉస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురొడ్డే పెద్దపార్టీ అంటూ లేకపోయిన ప్పుడూ, సాధారణంగా అందరిదృష్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన బలమైన ప్రాంతీయ పార్టీలపౖౖె ఉంటుంది.
బాహుబలి లాంటి బీజేపీ BJP ముందు శరణమా? మరణమా? తేల్చుకోవాల్సింది ఇక ఆయా ప్రాంతీయ పార్టీలే. 2024 ఎన్నికలు కేవలం మోడీ 3.0 మాత్రమే కాదు. మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డిల ప్రాంతీయ సిద్ధాంతాలు రాజకీయ శాశ్వతత్వానికి సంబంధించినవి. యాదవ వారసులు అఖిలేష్, తేజస్వి తమ రాష్ట్రాలలో గెలుపుకోసం ఆపసోపాలు పడుతున్నారు. ప్రధాన మంత్రులను తయారు చేయడంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన తమ తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. గద్దను బుల్‌ఫించ్ దెబ్బతీసినట్లే ఉత్తర భారతదేశంలో బిజెపిని ప్రత్యక్ష పోరులో కాంగ్రెస్ దెబ్బతీసే అవకాశం ఉంది. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లిd ఫలితాలపై లోక్‌సభలో జాతీయ పార్టీల మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో 348 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం బీజేపీకి 169, ఇండియా కూటమి దాని మిత్రపక్షాలకు 126 సీట్లు ఉన్నాయి. మిగిలిన స్థానాలలో వామపక్షాలు, ఇతర చిన్నపార్టీల తరఫున ఎంపీలున్నారు.
ఒకప్పుడు యూపీలో 36 లోక్‌సభ స్థానాలు, దాదాపు 60 శాతం అసెంబ్లిd సీట్లను గెలుచుకున్న 50 ఏళ్ల మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భవిష్యత్తును ఇప్పుడు జరగబోయే ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 2012లో, అఖిలేష్ రాష్ట్ర ఎన్నికలలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడిపోయారు. చివరకు 2019లో కేవలం ఐదు అసెంబ్లిd స్థానాల్లో గెలిచిన మాయావతితో పొత్తు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు అతను రాహుల్‌తో జతకట్టాడు. రాష్ట్రంలోని 80 స్థానాల్లో 100 శాతం విజయం సాధిస్తామని మోడీ, యోగి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరోవైపు మాయావతి ఒంటరిపోరును ప్రకటించారు.ఇక బీహార్ విషయానికొస్తే ఇక్కడ 40 లోక్‌సభ స్థానాలున్నాయి. 34 ఏళ్ల మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఒక దశాబ్దం పాటు బీహార్‌పై ఆధిపత్యం వ#హంచిన తండ్రి లాలూ యాదవ్‌కు తగిన వారసుడిగా సూర్యాస్తమయంలోకి వెళ్లవచ్చు లేదా సింహాసనాన్ని అధిరోహంచవచ్చు. ప్రస్తుతం, అతని రాష్ట్రీయ జనతాదళ్ లోక్‌సభలో సున్నా మరియు, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ ఒక సీటును మాత్రమే కలిగివున్నాయి. మిగిలిన 39 సీట్లు నీతీష్, బీజేపీ ఖాతాలో ఉన్నాయి. నితీష్ తన విశ్వసనీయతను కోల్పోయినందున, జూనియర్ యాదవ్‌కు ఆ స్థలాన్ని పట్టుకుని జాతీయ ఆటగాడిగా మారే అవకాశం ఉంది. మోడీ సంఖ్యను ప్రభావితం చేయడంలో ఆయన పలుకుబడి ఈసారి పరీక్షించబడుతుంది.
మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు భవిష్యత్తు ఔచిత్యాన్ని నిర్ణయిస్తారు. ఇద్దరూ జాతీయస్థాయి నేతలే. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న వారు ఇటీవల సొంతపార్టీ నేతల ఫిరాయింపులతో తమ సొంత పార్టీపై హక్కులే కోల్పోయారు. వారు తమ కేడర్, సంస్థాగత మద్దతును నిలుపుకోగలరా లేదా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. 2019లో బీజేపీ-సేన కూటమికి వ్యతిరేకంగా పవార్ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. శివసేనకు 18 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శివసేన నుంచి షిండే సేన వేరయింది. అలాగే శరద్ పవార్ గ్రూపు నుంచి అజిత్ వర్గం కూడా వేరుపడింది. ఈ రెండు పార్టీల బలం రెండు కొత్త పార్టీలుగా మారింది. అయితే ఈ లోక్‌సభ పోరాటంలో చీలికవర్గానికి చెక్ పెట్టేలా ప్రజాదరణ తిరిగి పొందుతారా లేదా అన్నదే కీలకం. సాంప్రదాయ ఓటు బ్యాంకును మళ్లిd పునరుద్ధరించుకో గలిగితేనే వీరికి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. లేదంటే ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు.ఇక పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే, మమతా బెనర్జీ వర్సెస్ మోడీకి ప్రతిష్టాత్మక పోరుకు ఈ రాష్ట్రం వేదికవుతోంది. 2019లో బీజేపీ 18 సీట్లు, ఆ తర్వాత అసెంబ్లిలో 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా టీఎంసీకి నిర్ణయాత్మక నష్టం కలిగించింది. తన టార్గెట్ 370 సాధించేందుకు బెంగాల్ నుంచి 35 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న మోడీ, అందుకోసం రెండేళ్లుగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టిసారించారు. ‘జమీందార్లు’గా పిలుచుకునే బీజేపీని పశ్చిమ బెంగాల్ నుంచి తరిమికొడతామని మమత ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఆమె ఏమేరకు నెరవేర్చుకుంటారో చూడాలి. ఇక్కడ ఇండియా కూటమిలో కీలక పార్టీలైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ను ఆమె దూరం పెట్టారు. దీంతో ఓట్ల చీలిక అనివార్యం. ఈ ప్రభావం కాషాయపార్టీకి మేలు చేస్తుందా? టీఎంసీకి మేలు చేస్తుందా అన్నదానిపై విశ్లేషకులే ఒక అంచనాకు రాలేక పోతున్నారు. ఏదేమైనా బెంగాల్ రాజకీయం ఈ ఎన్నికల తర్వాత కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.