Home » National » Pm Kisan 22nd Installment Update
National

PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి .. !

Authored By
Suma
The Telugu News | Updated on: February 7, 2026 5:57 pm
Advertisement

PM Kisan  :  దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు Farmers ఆశగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పథకానికి PM Kisan scheme సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది. లబ్ధిదారుల జాబితాను క్రమబద్ధీకరించే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అర్హతల విషయంలో రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల విడుదలైన గణాంకాలు చూస్తే తక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

Advertisement

PM Kisan : పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి .. !

PM Kisan  : లబ్ధిదారుల సంఖ్య తగ్గుదల వెనుక కారణాలు

అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కేవలం నాలుగు నెలల్లోనే సుమారు 35 లక్షల మందికి పైగా రైతుల పేర్లు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడ్డాయి. 2025 మార్చి నాటికి 10 కోట్లకు పైగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య జులై నాటికి 9.71 కోట్లకు, నవంబర్ నాటికి 9.35 కోట్లకు పడిపోయింది. అంటే కొన్ని నెలల్లోనే దాదాపు 70 లక్షల మందికి పైగా రైతులు జాబితా నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా అనర్హుల గుర్తింపు, డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు, భూమి వివరాల్లో వ్యత్యాసాలు, అలాగే ఈ-KYC పూర్తి కాకపోవడం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో రైతులు తమ వివరాలను తరచూ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

PM Kisan 22nd Installment : 22వ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి?

ఇప్పటివరకు ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ విడతలను విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సమాచారం ప్రకారం ఫిబ్రవరి 20 తర్వాత 22వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 చొప్పున నేరుగా జమ చేయనున్నారు. అయితే జాబితాలో పేరు ఉన్న రైతులకే ఈ సాయం అందుతుంది. అందుకే ముందుగానే స్టేటస్ చెక్ చేసుకోవడం అవసరమైన అప్‌డేట్లు పూర్తి చేయడం అత్యంత కీలకం. చిన్న మొత్తమే అయినప్పటికీ ఈ సాయం సాగు పనులకు కొంత ఉపశమనం కలిగిస్తోందని రైతులు చెబుతున్నారు.

PM Kisan 22nd Installment :  రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు

పీఎం కిసాన్ లబ్ధిని కొనసాగించాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. మొదటిగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ లబ్ధిదారుల స్టేటస్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. పేరు తొలగించబడితే వెంటనే తిరిగి నమోదు ప్రక్రియను ప్రారంభించాలి. ఈ-KYC పూర్తిగా చేయడం తప్పనిసరి. ఈ-KYC చేయని రైతుల ఖాతాల్లో డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అలాగే రైతు రిజిస్ట్రీలో పేరు నమోదు చేయడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వచ్చే రైతు ఐడీని పీఎం కిసాన్‌లో అప్‌డేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి లేకపోతే నిధులు జమ కావు. తెలంగాణలో రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ వంటి పథకాలు రైతులకు అదనపు మద్దతుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర పథకమైన పీఎం కిసాన్ లబ్ధి కోల్పోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. స్టేటస్ చెక్ చేయండి ఈ-KYC పూర్తి చేయండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉంచండి ఇవే 22వ విడత డబ్బులు పొందడానికి కీలక మార్గాలు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి