
Allu Arjun Rashmika Mandanna : AA22xA6పై అంచనాలు పీక్స్‌లో… రష్మిక ఈ సారి అల్లు అర్జున్‌తో ప్రేమ కాదు, వైరమే..!
Allu Arjun Rashmika Mandanna : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం AA22xA6 దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభ దశ నుంచే విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా విదేశీ టెక్నీషియన్లు, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Allu Arjun Rashmika Mandanna : AA22xA6పై అంచనాలు పీక్స్‌లో… రష్మిక ఈ సారి అల్లు అర్జున్‌తో ప్రేమ కాదు, వైరమే..!
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా ఖరారవ్వడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానులు, సినీప్రియులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఈ సినిమాను మరింత చర్చనీయాంశంగా మార్చాయి.ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఒక పాత్ర స్టైలిష్, మరోటి పవర్‌ఫుల్ అవతారంలో ఉంటుందనే ప్రచారం సాగుతోంది. తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో రష్మికతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఇందులో రష్మిక పాత్రకు విలన్ షేడ్స్ ఉంటాయనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథలో కీలక మలుపులు తిప్పే పాత్రలో ఆమె కనిపించనున్నారనే ప్రచారం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఇప్పటివరకు రొమాంటిక్ జంటగా అలరించిన అల్లు అర్జున్–రష్మిక జోడీ ఈసారి పూర్తిగా భిన్న కోణంలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాల్లో ఈ జంట బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించనున్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది. వీరితో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణ, కమెడియన్ యోగి బాబు, నటుడు జిమ్ సర్భ్ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్ కాస్టింగ్ సినిమాకు మరో ప్రత్యేకతగా నిలుస్తోంది.
Therali Kudumulu : మనం నిత్యం చేసుకునే పిండి వంటల కంటే భిన్నంగా, ఆరోగ్యానికి మేలు చేస్తూ, రుచిలో సాటిలేని…
IPL Ticket Scam : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఎంతటి వినోదాన్ని పంచుతుందో, అదే…
Tamil Nadu CM Vijay : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 'తమిళగ వెట్రి…
Beetroot Juice : బీట్‌రూట్‌లో విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, ప్రతి ఒక్కరి శరీరం…
Venu Swamy Vijay TVK : టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ జాతకాలను విశ్లేషిస్తూ ఎప్పుడూ చర్చల్లో ఉండే వేణుస్వామి,…
Vijay TVK : తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK),…
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
This website uses cookies.