Viral News : మాయల మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో ఉంటుందని మనం అనేక కథలు విన్నాం. అయితే ఇప్పుడు మర్రి చెట్టు తొర్రలో రూ.65 లక్షలు బయటపడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.అయితే అసలు అంత డబ్బు దాంట్లోకి ఎలా వచ్చిందని అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం (ఏప్రిల్ 18) వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. వారు ఆ డబ్బుని చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఏటీఎం మెషిన్లలో ఫిల్ చేసేందుకు బయలుదేరారు.
అయితే మధ్యాహ్నా సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపి వేసి భోజనం తినేందుకు బంకులోని ఓ గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి వచ్చి తాళం పగులగొట్టి రూ.64 లక్షల విలువైన 500 నోట్ల కట్టలను ఎత్తుకెళ్లాడు. 100 నోట్ల కట్టలున్న నాలుగు లక్షలను వదిలేసి 500 నోట్ల కట్టలున్న రూ.64 లక్షలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు వారు తెచ్చిన రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎస్వీ శ్రీధర్‌రావు, తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
అయితే ముసుగు ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి వాహనంలో నగదు చోరీ చేసిన దృశ్యాలు కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని గంటలలో చేధించారు. అయితే ఈ దొంగతనానానికి పాల్పడింది ఎవరో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. గతంలో సీఎంఎస్ సంస్థలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన మహేష్‌గా గుర్తించారు. అతడు ఆ నోట్ల కట్టలని తన స్వగ్రామమైన సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలో అతడి ఇంటికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొఱ్ఱలో దాచిపెట్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు అసలు విషయం చెప్పి అరెస్ట్ అయ్యాడు.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.