young man threatened girl in the name of love in haryana
Crime News : ఓ యువతి ఒక యువకుడిని ప్రేమించింది. అతడిని గత మూడేళ్ల నుంచి ప్రేమిస్తోంది. మూడేళ్లుగా అతడితో తిరుగుతోంది. అయినా కూడా తన హద్దుల్లో తాను ఉంది. ఏనాడూ మితిమీరి ప్రవర్తించలేదు. ఏదైనా కూడా పెళ్లి తర్వాతే అని ఆ యువకుడికి తేల్చి చెప్పింది. దీంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆ యువతిపై అఘాయిత్యం చేయాలనుకున్నాడు. దాని కోసం పక్కా ప్లాన్ వేశాడు. తనను హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చాడు. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడు.
young man threatened girl in the name of love in haryana
మెళకువ వచ్చిన తర్వాత ఆ యువతి నిలదీసింది. తనపై ఇలా అఘాయిత్యం చేస్తావా అని ప్రియుడిపై సీరియస్ కావడంతో పెళ్లి చేసుకుంటా అంటూ ఆ యువతిని నమ్మించాడు. కానీ.. ఆ తర్వాత నుంచి మొహం చాటేశాడు. ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మొహం చాటేస్తుండటంతో తనకు అనుమానం వచ్చి తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అత్యాచారం చేసి మొహం చాటేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.
ఈ ఘటన హర్యానాలోని ఫతేహాబాద్ లో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేయడమే కాకుండా ఇప్పుడు చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ యువకుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ యువతిని వైద్య పరీక్షలకు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.