Home » Andhra Pradesh » Nellore Doctor Fight With Woman Video Became Viral In Social Media
andhra pradesh

Nellore.. నడిరోడ్డుపై వైద్యుడు, మహిళ కొట్టుకున్నారు.. వీడియో వైరల్..

Authored By
praveen T
The Telugu News | Updated on: September 6, 2021, 10:47 am
Advertisement

వైద్యుడికి సమాజంలో ఉండే గుర్తింపు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అటువంటి వైద్యుడు జిల్లాలో ఓ మహిళతో కలిసి రచ్చరచ్చ చేశాడు. నడిరోడ్డుపై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వివరాల్లోకెళితే.. నెల్లూరు సిటీకి చెందిన హోమియోపతి డాక్టర్ బాలకోటేశ్వరరావు స్థానికంగా ప్రజల్లో వైద్యం చేస్తూ మంచి పేరే ఉంది. కానీ, తాజాగా జరిగిన ఘటనతో ఆ పేరు బదనాం అయింది. ఈ వైద్యుడు తన దగ్గర పని చేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య కొంతకాలం పాటు సంబంధం కొనసాగింది.

Advertisement

 

Advertisement

అయితే, ఇటీవల డాక్టర్ బాలకోటేశ్వరరావు సదరు మహిళను దూరం పెట్టాడు. దాంతో సదరు మహిళ తన వద్దకు ఎందుకు రావడం లేదని డైరెక్ట్‌గా ఆస్పత్రికి వెళ్లి నిలదీసింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి, తీవ్రవాగ్వాదమే జరిగింది. అలా ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. డాక్టర్ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని సదరు మహిళ అతడిని రోడ్డుపైకి తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే కొట్టింది. అతడు కూడా ఆమెను కొట్టేందుకు యత్నించాడు. ఇదంతా ఎవరో రికార్డు చేసి అప్‌లోడ్ చేయగా, స్థానికంగా ఈ వీడియో బాగా వైరలవుతోంది. సదరు మహిళ డాక్టర్ మోసం చేసినట్లు పేర్కొంటూ జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారిస్తున్నారు. అయితే, రోడ్డుపై వైద్యుడు, మహిళ కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో, జిల్లా గ్రూపుల్లో వైరలవుతోంది.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి