nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆ శుభదినం మరెంతో దూరంలో లేదు. డీఏ పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడనే విషయంపై స్పష్టత వచ్చేసింది. సెప్టెంబర్ 28న (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ డీఏ, డీఆర్ పెంపుపై ప్రకటన చేయవచ్చునని సంకేతాలు అందుతున్నాయి. 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ జీతం భారీగా రానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కరవు భత్యం జూలై 1, 2022 నుంచి వర్తించనుంది. అంటే సెప్టెంబర్ జీతంలో ఆ నెల పెరిగిన డీఏతో పాటు గత మూడు నెలల ఎరియర్లతో కలిపి లభిస్తుంది.
అంటే సెప్టెంబర్ జీతం పెద్దమొత్తంలో అందనుంది. ఏఐసీపీఐ సూచీ ప్రకారమే డీఏ పెంపు ఉంటుంది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం కరవు భత్యం ఆధారిత ఏడాది 2016లో మార్పు జరిగింది. వేజ్ రేట్ ఇండెక్స్ కొత్త సిరీస్ జారీ చేసింది. అంటే డబ్ల్యూఆర్ఐ కొత్త సిరీస్ 1963-65 పాత సిరీస్ స్థానంలో ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ) గణాంకాలు పెరుగుతూ వస్తున్నాయి. మేలో గణనీయంగా పెరిగింది. 1.3 పాయింట్లు పెరిగి 129కి చేరుకుంది. . మహమ్మారి కారణంగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ మే 2020లో DA పెంపును నిలిపివేసింది. జూన్ 30, 2021 వరకు దానిని పునఃప్రారంభించలేదు.
7th Pay Commission modi government is all set to increase the da
ధరల పెరుగుదల నేపథ్యంలో మార్చి 30న చేసిన డీఏ పెంపు ప్రకటనతో 1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 34 శాతంగా ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా డీఏని ఏడాదిలో రెండుసార్లు సవరించడంతో ఈ స్థాయిలో ఉంది. మొదటసారి జనవరి నుంచి జూన్ వరకు.. కాగా రెండవది జులై నుంచి డిసెంబర్ వరకు కేంద్రం పెంచింది. ఈ 4% కరువు భత్యం( (DA) పెంపు తో ఉద్యోగులకు వార్షికంగా కనీసం రూ. 8640 నుంచి గరిష్టంగా రూ. 27,312 లవరకు వేతనంలో పెరుగుదల ఉంటుందని తెలుస్తుంది.
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
This website uses cookies.