Wedding : ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. దగ్గర వాళ్లే కొంతమంది మోసాలు చేస్తుంటే, ఇక బయట వాళ్లు ఇంకా ఎంత చేయాలి. ప్రస్తుతం పెళ్లి విషయాలలో కూడా మోసాలు జరుగుతున్నాయి. అంతకుముందే పెళ్లయిన అమ్మాయి పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని అతడి దగ్గర అంతా దోచేసుకొని వెళ్ళిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే గుంటూరు జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి చదువుకొని ప్రస్తుతం మోటో కంట్రోలర్ మెకానిక్ పనిచేస్తున్నారు. అతని తండ్రి పోలియోతో బాధపడుతున్నారు.తల్లి కూడా అనారోగ్యంగానే ఉంటుంది.
అయితే వాళ్లు తమ కొడుకుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఓ రిటైర్డ్ ఉద్యోగి ద్వారా సంబంధం వచ్చింది. ఇరు కుటుంబాలకు నచ్చడంతో పెళ్లికి ముందడుగు వేశారు. అయితే ఆ అమ్మాయికి తండ్రి లేడు. దీంతో శ్రీనివాస్ పెద్దమనసు చేసుకొని ఆమె నుంచి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండు లక్షలు పెట్టి ఉన్నంతలో ఆమెకు బంగారం చేయించి పెళ్లి సమయంలో ఇచ్చాడు. 6 లక్షలు పెట్టి ఊర్లో రిసెప్షన్ పెట్టించారు. ఇంత జరిగాక అమ్మాయి ఏదో ఒక కారణంతో అతడిని దూరం పెట్టేది. కొన్నాళ్లకి ఇంట్లో తల్లి ఆరోగ్యం బాలేదని చెప్పి వెళ్ళిపోయింది.
రెండు మూడు నెలలైనా ఆమె తిరిగి రాలేదు. దీంతో శ్రీనివాసరావు ఆమె గురించి ఆరా తీశాడు. అయితే ఆ అమ్మాయికి గతంలోనే పెళ్లయిందని తెలుసుకున్నారు. షాక్ అయిన శ్రీనివాస్ తనని మోసం చేశారని ఆ యువతి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి అయ్యాక తమ కుటుంబానికి చక్కగా చూసుకుంటుందనుకున్నా అతడు చివరికి దారుణంగా మోసపోయాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పెళ్లి విషయంలో జాగ్రత్త పడాలి. అన్ని విధాలా చూసుకొని పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.