బహుశా పోయేకాలం అంటే ఇదేనేమో. రోజు రోజుకి పాపాలు పెరుగుతున్నాయి. మనిషిలో మానవత్వం అనేది లేకుండా పోతుంది. శారీరక, ఆర్థిక సంబంధాలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నాయో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. బర్రి రమేష్ వైజాగ్ వన్ టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి శివానితో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే శివానికి టాక్సీ డ్రైవర్ రామారావు పరిచయం ఏర్పడింది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను మందలించాడు. చాలాసార్లు అతనితో దొరికిపోవడంతో భర్త అతనితో వెళ్లిపొమ్మని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పెళ్లికి కట్నం కింద ఇచ్చిన అరెకరం పొలంతో పాటు అతడి అడ్డు తొలగించుకుంటే తనని ఎవరు ప్రశ్నించరని ప్రియుడుతో కలిసి పెద్ద ప్లాన్ వేసింది. భర్తను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చింది. అలాగే బంగారం తాకట్టు పెట్టి ప్రియుడికి లక్షన్నర ఇచ్చింది. ఈనెల 1 ప్రియుడిని ఇంటికి పిలిచి ప్లాన్ అమలు చేశారు.
రమేష్ కి మద్యం తాగించి వీడియోలు తీసింది. రమేష్ పడుకునేంతసేపు ప్రియుడిని ఇంటి కింద ఉంచింది. అతడు పడుకున్నాక రామారావు, నీలాలను పిలిచింది. ఆ తర్వాత రమేష్ మొహంపై దిండు పెట్టి బలంగా నొక్కారు. ఈ ఘటన మొత్తాన్ని భార్య వీడియో తీసి తెల్లారేసరికి పడి ఉన్నాడని గుండెపోటుతో మరణించాడని బంధువులకు తెలిపింది. అంత్యక్రియలు చేయడానికి హడావిడి చేయడంతో రమేష్ అన్నయ్యకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రమేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. అందులో రమేష్ ఊపిరాడక చనిపోయాడని తేలింది. దీంతో ఆమె వ్యవహారం అంతా బయటపడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.