Home » News » A Wife Married Another Women To Her Husband
News

భర్తను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసిన భార్య .. కానీ చివర్లో ఒక ట్విస్ట్ ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: August 18, 2023 9:43 pm
Advertisement

భర్తకు మరో యువతి తో పెళ్లి చేసింది భార్య. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. బంజారా హిల్స్ లోని సింగాడి గుంట బస్తీకి చెందిన ఓ యువతి హోమ్ ట్యూటర్ గా పనిచేస్తుంది. యూసఫ్ గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో వారికి చెప్పి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.

Advertisement

నిశ్చితార్థం కూడా అయిపోవడంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. ఈ సమయంలోనే గాంధీకి రోజా అనే యువతీతో పరిచయం ఏర్పడింది. ఆమెతో కూడా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని ప్రేమికురాలికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలకు గొడవలు జరిగాయి. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. అయితే తాము ఇద్దరూ కేవలం స్నేహితులం మాత్రమే అని రోజా చెప్పుకొచ్చింది. దీంతో నిజమే అని నమ్మిన యువతి అతడితో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది.

A wife married another women to her husband

Advertisement

పెద్దల సమక్షంలో మే 14న పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి పెద్దగా రోజా వ్యవహరించింది. అన్ని దగ్గరుండి చూసుకొని పెళ్లి చేసింది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు కాపురం సజావుగానే సాగింది. కొద్దిరోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ఎదురు ప్రశ్నిస్తే కొట్టడం ప్రారంభించాడు. ఇంతలోనే ఆమెకు అసలు విషయం తెలిసింది రోజా గాంధీ లకు తమ పెళ్ళి కన్నా ముందే వివాహం జరిగిందని. దీంతో ఆ యువతి లబోదిబోమన్నది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. గాంధీ రోజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి