Agneepath, A Big Advantage For YCP
YCP : అగ్నిపథ్ స్కీమ్ వివాదానికి సంబంధించి గలాటా దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోంది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ – బీజేపీ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విధ్వంసాల్ని ఖండించారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడం పట్ల జనసేనాని సంతాపం వ్యక్తం చేశారు. దాడికి స్కెచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.
ఓ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఈ తతంగానికి స్కెచ్ వేసినట్లుగా అనుమానిస్తూ అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకపోవడం గమనార్హం. అది కొంత ఏపీ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయమే. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంతకీ, ఈ వివాదం కారణంగా మారే రాజకీయ సమీకరణాలు ఎలా వుండబోతున్నాయి.? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీయడమైతే సహజమే. పైగా, వరుసగా రెండుసార్లు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వుంటుంది.
Agneepath, A Big Advantage For YCP
పెట్రోధరల మంట సహా అనేక అంశాల్లో మోడీ సర్కారు వైఫల్యాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. సో, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ‘ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..’ అనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఓ రకంగా వైసీపీకి అడ్వాంటేజ్. బీజేపీకి జాతీయ స్థాయిలో మెజార్టీ తగ్గితే, ఏపీ నుంచి ఎంపీల బలం అవసరమవుతుంది. అప్పుడు ఏపీ నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ గట్టిగా వినిపించేందుకు వైసీపీకి అవకాశం దొరుకుతుంది. సో, ఎలా చూసినా రానున్న రోజులు వైసీపీకి మరింత సానుకూలమేనని చెప్పక తప్పదు.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.