allu arjun heroienes not getting offers
Allu Arjun : సాధారణంగా అల్లు అర్జున్ వివాదాలకి చాలా దూరంగానే ఉంటాడు. ఇటీవల మనోడు వాణిజ్య ప్రకటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. దీంతో విమర్శల పాలవుతున్నాడు. . ఫ్రూటీ, రాపిడోతో పాటు రెడ్ బస్ కి కూడా బన్నీ బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెల్సిందే. తాజాగా ఇప్పుడు బన్నీ ఖాతాలో జొమాటో కూడా వచ్చి చేరింది. అయితే రాపిడో యాడ్ చేసినప్పడు అందులో ఆర్టీసీ బస్సుని కించపరిచినట్టు యాడ్ చిత్రీకరించారు. దీంతో అతనితో పాటు యాడ్ నిర్వాహకులపై కూడా ఆర్టీసీ యాజమాన్యం ఫైర్ అయింది. ఇక తాజాగా చేసిన జొమాటో యాడ్ కూడా వివాదాస్పదం కావడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ నటించిన జోమాటో యాడ్‌పై నెటిజన్లు, సౌత్ సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్‌పై సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మండిపడుతున్నారు. ఇంతకి అసలు విసయం ఎంటంటే.. అల్లు అర్జున్ తాజాగా నటించిన ఈ కమర్షియల్ యాడ్‌లో నటుడు సుబ్బరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో సుబ్బరాజును బన్నీ కొడతాడు. బన్నీ దెబ్బకు సుబ్బరాజు గాల్లో తేలిపోతాడు. బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా?.. అని సుబ్బరాజు అడుగుతాడు. సౌత్ సినిమా కదా? ఎక్కువ సేపు ఎగరాలి అని బన్నీ అంటాడు.
allu arjun trolls on his zomato advertisement
అంతే సౌత్ సినిమాలు, అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై బన్నీ కౌంటర్ వేసినట్టుగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ యాడ్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే సౌత్ సినిమాలపై కౌంటర్ వేసినట్టుగా యాడ్ చేయడంతో పలువురు మండిపడుతున్నారు. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారు, ఇప్పుడు సౌత్ సినిమాలను అవమానిస్తున్నారా అంటూ .. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.ఇటీవల పుష్ప చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన బన్నీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.