Home » News » Anchor Lasya Anounces Her Pregnancy Second Time
News

Anchor Lasya : రెండోసారి గర్బందాల్చిన లాస్య.. గాల్లో తేలిపోతోన్న యాంకర్

Authored By
aruna
The Telugu News | Published on: September 21, 2022, 3:30 pm
Advertisement

Anchor Lasya : బిగ్ బాస్ షోతో లాస్య కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. అంతకు ముందు ఐదేళ్ల గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు మ్యూజిక్ షోతో లాస్య ఫేమస్ అయింది. ఆ తరువాత పర్సనల్ విషయాలు, పెళ్లి, పిల్లల వల్ల స్క్రీన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే బిగ్ బాస్ షోతో మళ్లీ లాస్య లైమ్ లైట్‌లోకి వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో లాస్య చేసిన సందడి అందరికీ తెలిసిందే. టాస్కులేమీ ఆడకపోయినా కూడా అభిజిత్, హారిక, నోయల్ గ్యాంగుతో ఉంటూ వచ్చింది.

Advertisement

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు తన భర్త మంజునాథ్, బిడ్డ జున్ను గురించి చెబుతూనే ఉండేది. తన జున్నుగాడు ఎలా ఉన్నాడో అంటూ తెగ బాధపడేది.అయితే జున్ను గాడు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం లాస్యను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. లాస్యను చూడనైనా చూడలేదు. కానీ తన భర్త, బిడ్డను చూసిన లాస్య మాత్రం తెగ ఎమోషనల్ అయింది.

Anchor Lasya Anounces Her Pregnancy second Time

Advertisement

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత లాస్య ఎక్కువగా సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టేసింది. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ ద్వారా లాస్య మరింతగా జనాలకు దగ్గరవ్వాలని చూసింది. యూట్యూబ్‌లో ఫ్యామిలీ వీడియోలు, పండుగ వీడియోలు చేస్తుంటుంది. ఇక నెట్టింట్లో అయితే పర్సనల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అలా లాస్య తన ఫ్యాన్స్‌‌ను అలరిస్తుంటుంది.

అయితే తాజాగా లాస్య తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను రెండో సారి తల్లి కాబోతోన్నాను అని, ఇంకో బిడ్డ రాబోతోందని, తన ఫ్యామిలీ ఇంకాస్త పెద్దది కాబోతోందని ప్రకటించేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి