Home » Entertainment » Andhra King Taluka Teaser Released
Entertainment

Andhra King Taluka Teaser | సాలిడ్ హిట్ కోసం సిద్ధమవుతున్న రామ్ పోతినేని.. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ టీజర్‌పై భారీ రెస్పాన్స్!

Authored By
Sam C
The Telugu News | Updated on: October 12, 2025 12:11 pm
Advertisement

Andhra King Taluka Teaser | టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ కమ్ టాలెంటెడ్ యంగ్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ పోతినేని, ప్రస్తుతం తన కెరీర్‌కు మళ్లీ ఊపు తెచ్చే ఒక్క ఘన విజయాన్ని కోసం ఎదురుచూస్తున్నారు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రామ్‌కి, ఆ తర్వాత మరే సినిమా కూడా ఆ స్థాయిలో రాలేదు.ఈ నేపథ్యంలో రామ్ ప్రస్తుతం చేస్తున్న తాజా సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలుకా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

#image_title

అద‌ర‌గొట్టేశాడు..

Advertisement

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి హిట్ మూవీకి దర్శకత్వం వహించిన మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తుండటంతో అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, ఇటు మాస్ ఆడియెన్స్‌లో కూడా హైప్ క్రియేట్ అయింది. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల నుండి భారీ స్పందన అందుకుంటోంది. తాజాగా విడుద‌లైన టీజర్‌లో రామ్ పోతినేని మాస్ డైలాగ్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

కథ ప్రకారం రామ్ పాత్ర ఓ సూపర్‌స్టార్‌కు డై హార్డ్ ఫ్యాన్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఆ సూపర్‌స్టార్ పాత్రలో కన్నడ లెజెండరీ యాక్టర్ ఉపేంద్ర కనిపించనున్నారు. ఫ్యాన్ – ఐడల్ మధ్య ఉండే ఎమోషనల్ కనెక్షన్ ఈ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.”నేను అభిమానిని.. కానీ అభిమానానికి కూడా హద్దులు ఉంటాయి బాస్!” అన్న రామ్ డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తోంది.

Advertisement

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి