Home » Andhra Pradesh » Ap Cm Ys Jagan Sacrifice For Ap Minister
andhra pradesh

YS Jagan : జగన్ త్యాగం.. ట్రోల్ చేసే టిడిపి ఫ్యాన్స్ కి ఇది తెలిస్తే తట్టుకోలేరు..!!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: February 21, 2023 9:18 pm
Advertisement

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడు మీదున్నారు. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయన ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను కూడా సీఎం జగన్ ప్రకటించారు. కొత్త ఎమ్మెల్సీలుగా ఇదివరకు అవకాశం రాని వారికి ఇచ్చారు సీఎం జగన్. చాలా ఏళ్ల నుంచి ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది అందులో ఉన్నారు. ఇటీవలే టీడీపీ నుంచి

Advertisement

ap cm ys jagan sacrifice for ap minister

వైసీపీకి వచ్చిన జయమంగళ వెంకటరమణకు కూడా ఎమ్మెల్సీ రావడం గమనార్హం.మరో నాయకుడు మర్రి రాజశేఖర్. ఆయన కమ్మ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆయన చాలా ఏళ్ల నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అది తాజాగా దక్కింది. మర్రి రాజశేఖర్ చాలా ఏళ్ల నుంచి వైసీపీతోనే ఉన్నారు. వైసీపీ పార్టీ నుంచి ఆయన ఓడిపోయినా కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. 2019 లో మర్రి రాజశేఖర్ పోటీ చేయలేదు. దానికి కారణం..

Advertisement

ap cm ys jagan sacrifice for ap minister

YS Jagan : 2019 లో పోటీ చేయని మర్రి రాజశేఖర్

విడదల రజినీ ఎంట్రీ ఇవ్వడం. ఆమెకు టికెట్ రావడంతో మర్రి రాజశేఖర్.. ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అయినా కూడా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చి తన గొప్పదనాన్ని నిరూపించుకున్నారు వైఎస్ జగన్. అయితే.. వచ్చే ఎన్నికల్లో విడదల రజినీ.. చిలకలూరిపేట నుంచి గెలవాలంటే ఖచ్చితంగా మర్రి సపోర్ట్ కావాలి. అందుకే.. మర్రికి ఎమ్మెల్సీని ఇచ్చి తన హామీని నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి