Iphone 14 : కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు మార్కెట్లో ఉన్న ఆఫర్లను చూసి కొనుక్కుంటే మంచిది. ఈ మధ్యనే ఆపిల్ ఐఫోన్లు కొత్త సిరీస్ తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు ఈ ఫోన్ ఆఫర్ల తెలుసుకొని కొనుగోలు చేయండి. ఆపిల్ లో కూడా లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ లో అందుబాటులోకి వచ్చాయి. భారీ ఆఫర్లతో తగ్గింపు ధరతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎక్సైంజ్ ఆఫర్ కింద ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లను కొనుగోలు చేస్తే 50 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆపిల్ కంపెనీ ఇటీవలనే ఐఫోన్ 14 సిరీస్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సిరీస్ లో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు ప్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొనుగోలు చేయాలని అనుకునేవారు ముందుగానే ఆర్డర్ ఇవ్వచ్చు. తర్వాత ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫోన్లు కొనాలనుకునే వారికి ట్రేడ్ ఇన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మీ వద్ద ఉన్న పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ కొంటే భారీ తగ్గింపు పొందవచ్చు. అలాగే ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ ఆఫర్ ని సొంతం చేసుకోవచ్చు. అయితే తగ్గింపు మాత్రం తక్కువగానే ఉంటుంది.
ఆపిల్ ట్రేడ్ ఇన్ ఆఫర్ కింద 14 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.58,730 వరకు తగ్గింపు ధర లభిస్తుంది. అంతేకాకుండా క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోను కొనుగోలు చేస్తే 6000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే 54,900 విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇవి కాకుండా వినియోగదారులు క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొత్త ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఈఎమ్ ఐ ఆప్షన్ వలన ఎక్కువ వడ్డీ పడుతుంది. అందువల్ల డబ్బులు ఉంటే ఒకేసారి చెల్లించి ఐఫోన్ సొంతం చేసుకోవడం మంచిది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.