
Astrology Tips for these Zodiac Signs people wear black thread
Zodiac Signs : చాలామంది కాళ్లకు నల్లదారాన్ని కడతారు. కొంతమంది దిష్టి తగలకుండా కాలికి నల్ల దారాన్ని కడతారు. ఇంకొంతమంది తెల్లని కాళ్లకు ఫ్యాషన్ గా ఉంటుందని నల్ల దారాన్ని కడతారు. కొందరు ఎందుకు కట్టుకుంటారో తెలియకుండా కట్టుకుంటారు. కొంతమంది పుట్టగానే పిల్లలకు చేతులకు, కాళ్లకు నల్లదారాన్ని కడుతారు. కొంతమందికి కాళ్లల్లో నొప్పి వుంటుంది. నొప్పి రాకుండా ఉండడానికి కాలికి నల్లదారం కట్టుకుంటారు. కాళ్లే కాదు చేతులు, నడుముకు, మెడకి కూడా కొందరు నల్లదారాన్ని కట్టించుకుంటారు. అసలు ఈ నల్ల దారాన్ని అందరు కట్టుకోవచ్చో లేదో తెలుసుకుందాం…
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మన కంటిచూపుకి శక్తి ఉంటుంది. కొంతమందికి వారికి తెలియకుండానే ఎదుటివారిపై కంటిచూపు పడితే వారికి చెడు జరుగుతుంది. కంటిచూపుకి అంత శక్తి ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లలకు దిష్టి తగులుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు సున్నితంగా, అందంగా ఉంటారు కాబట్టి ఎక్కువగా ముద్దొస్తారు. అందుకే వారిపై చెడు దృష్టి పడకుండా కాళ్లకు, చేతులకు నల్లదారాన్ని కడుతారు. ఇలా కట్టడం వలన చెడు దృష్టి వారిపై పడదని కొందరి నమ్మకం. ఎందుకంటే నలుపు చెడు శక్తిని లాగేస్తుంది.అలాగే శనిదేవుడిని పూజించేటప్పుడు కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటారు. దీనివలన రాహు, కేతు దోషాలు దగ్గరికి రావని కొందరు అంటారు.
Astrology Tips for these Zodiac Signs people wear black thread
కొంతమందికి జీవితంలో ఆర్ధిక సమస్యలు ఉంటాయి. అలాంటివారు మంగళవారం రోజు నల్ల దారాన్ని కట్టుకుంటే ఆర్ధిక సమస్యలు తొలగిపోయి, ఇంట్లో డబ్బు కొరత వుండదని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నల్ల దారాన్ని కట్టుకునే ముందు దానికి తమ్మిది ముడులు వేసి కట్టుకోవాలంట. ఈ దారాన్ని కట్టడం వలన పిల్లలు ఎలాంటి అసౌకార్యానికి గురి కారు.అందుకే పెద్దవాళ్లు కూడా నల్లదారాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతారు. నల్లదారాన్ని కట్టుకున్నాక గాయత్రీ మంత్రాన్ని జపిస్తే ఆ దారం మరింత శక్తివంతంగా తయారవుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, నల్ల దారాన్ని కొన్ని రాశులవారు కట్టుకోకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశిలో పుట్టినవారికి నలుపు రంగు అస్సలు కలిసిరాదు. కనుక వీరు నల్ల దారాన్ని అస్సలు కట్టుకోకూడదు.నల్ల దారాన్ని కట్టుకుంటే జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ నల్ల దారాన్ని ధనుస్సురాశి వారు, తులా రాశి వారు కట్టుకుంటే వారికి చాలా మంచి జరుగుతుందంట. జీవితంలో ఎటువంటి సమస్యలు రావు. మనసు నిశ్చింతగా, హాయిగా ఉంటుంది. కనుక ఈ రాశి వారు ఈ నల్లదారాన్ని చేతికి కాని, కాలికి కాని నిశ్చింతగా, ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.