Marriage : మన భారతీయులు ఆచార సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. ముఖ్యంగా హిందువులు ఆచార సాంప్రదాయాలను ఎక్కువగా అనుసరిస్తారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యమైన ముహుర్తం పెట్టి జరిపిస్తారు. ఎక్కడికి అయిన వెళ్లాలన్న మంచి ముహుర్తం చూసుకొని వెళతారు. ఇంటి ఆడపిల్లను అత్తారింటికి పంపించేటప్పుడు కూడా మంచి ముహుర్తం చూసి పంపిస్తారు. అలాగే ఇంటికి ఏ వాహనమైన కొనాలన్న, తీసుకురావాలన్న మంచి సమయం చూసి తీసుకువస్తారు. తీసుకువచ్చాక ఏదైన దేవాలయానికి వెళ్లి పూజను జరిపించుకుంటారు. ఇలా ముహుర్తం చూసి చేయడం వలన ఎటువంటి నష్టం లేకుండా, మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఏ చిన్న పనికైన మంచి ముహుర్తం చూసి జరిపిస్తారు. ఆచార సాంప్రదాయాలను హిందువులు పాటించినంతగా ఇంకా ఏ మతం వారు పాటించరు.
ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకు ప్రతి విషయం ముహుర్తానికి జరిపించుకుంటాడు. అలాగే ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. వివాహానికి సంబంధించిన ముహుర్తానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. మన పూర్వీకులు వివాహాలను ఎక్కువగా రాత్రిళ్లు ముహుర్తం పెట్టి నిర్వహించేవారు. ఇప్పుడు ఎక్కువగా ఉదయాన్నే ముహుర్తాలను పెట్టి వివాహాలను జరిపిస్తున్నారు. అలాగే ఇప్పటి వారి కంటే పూర్వీకులే ఎక్కువగా ముహుర్తానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వివాహం ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేసేవారు. అందుకే అప్పటి కుటుంబంలోని వారు జీవితాంతం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో నిండు నూరేళ్లు హాయిగా జీవించేవారు. అలాగే పిల్లా పాపలతో సంతోషంగా గడిపేవారు. అందుకే వివాహాన్ని సరైన సమయానికి జరిపించాలి.
ఇప్పటి కాలంలో మాత్రం పెట్టిన ముహుర్తానికి, వివాహం జరిగే సమయానికి అసలు సంబంధమే ఉండడం లేదు. ముహుర్తం దాటాక వివాహాన్ని జరిపిస్తున్నారు. ఎందుకంటే వధూవరులు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివలన ముహుర్త సమయం దాటిన తరువాత వివాహం జరుగుతుంది. దీనివలన వివాహా బంధానికి ఎక్కువ బలం ఉండదు. వివాహం సరైన సమయానికి జరగక జీవితంలో వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితాంతం సంసార జీవితంలో పలు రకాల బాధలను అనుభవిస్తారు అని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు అంటున్నారు. వివాహం సరైన ముహుర్తానికి జరగకపోతే ఎటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం వివాహం పండితులు పెట్టిన ముహుర్తానికి జరగకపోతే వధూవరుల జీవితంలో సంతానం కలగకపోవడం, ఇరువురి మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం లాంటి సమస్యలు వస్తాయి. కొందరు ఇరువురు విడిపోయే దాకా వస్తారు. అందుకే వివాహాన్నిసరైన సమయానికి జరిపించాలి. ఇటువంటి సమస్యలు వస్తాయనే మన పూర్వీకులు సరైన ముహుర్తానికి వివాహం జరిపించేవారు. సరైన ముహుర్తానికి వివాహం జరిపిస్తే వధూవరులు జీవితాంతం అన్యోన్యంగా, సుఖసంతోషాలతో, పిల్లా పాపలతో హాయిగా జీవిస్తారు. అందుకే హిందువులు ఆచార సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కాబట్టి అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వివాహ ముహుర్తానికి పెళ్లి జరిపించండి. జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించండి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.