Marriage : వివాహం పెట్టిన ముహుర్తానికి జ‌రగ‌క పోతే ఏమౌతుందో తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Marriage : వివాహం పెట్టిన ముహుర్తానికి జ‌రగ‌క పోతే ఏమౌతుందో తెలుసా…

 Authored By anusha | The Telugu News | Updated on :27 June 2022,7:00 am

Marriage : మ‌న భార‌తీయులు ఆచార సాంప్ర‌దాయాల‌ను ఎక్కువ‌గా పాటిస్తారు. ముఖ్యంగా హిందువులు ఆచార సాంప్ర‌దాయాల‌ను ఎక్కువ‌గా అనుస‌రిస్తారు. ఇంట్లో ఏ చిన్న శుభ‌కార్య‌మైన ముహుర్తం పెట్టి జ‌రిపిస్తారు. ఎక్క‌డికి అయిన వెళ్లాల‌న్న మంచి ముహుర్తం చూసుకొని వెళ‌తారు. ఇంటి ఆడ‌పిల్ల‌ను అత్తారింటికి పంపించేట‌ప్పుడు కూడా మంచి ముహుర్తం చూసి పంపిస్తారు. అలాగే ఇంటికి ఏ వాహ‌న‌మైన కొనాల‌న్న‌, తీసుకురావాల‌న్న మంచి స‌మ‌యం చూసి తీసుకువ‌స్తారు. తీసుకువ‌చ్చాక ఏదైన దేవాల‌యానికి వెళ్లి పూజ‌ను జ‌రిపించుకుంటారు. ఇలా ముహుర్తం చూసి చేయ‌డం వ‌ల‌న ఎటువంటి న‌ష్టం లేకుండా, మంచి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌ల విశ్వాసం. అందుకే ఏ చిన్న ప‌నికైన మంచి ముహుర్తం చూసి జ‌రిపిస్తారు. ఆచార సాంప్ర‌దాయాల‌ను హిందువులు పాటించినంత‌గా ఇంకా ఏ మ‌తం వారు పాటించ‌రు.

ప్ర‌తి మ‌నిషి పుట్టిన ద‌గ్గ‌ర నుంచి మ‌ర‌ణించేవ‌ర‌కు ప్ర‌తి విష‌యం ముహుర్తానికి జ‌రిపించుకుంటాడు. అలాగే ప్ర‌తి మ‌నిషి జీవితంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం వివాహం. వివాహానికి సంబంధించిన ముహుర్తానికి ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. మ‌న పూర్వీకులు వివాహాల‌ను ఎక్కువ‌గా రాత్రిళ్లు ముహుర్తం పెట్టి నిర్వ‌హించేవారు. ఇప్పుడు ఎక్కువ‌గా ఉద‌యాన్నే ముహుర్తాల‌ను పెట్టి వివాహాల‌ను జ‌రిపిస్తున్నారు. అలాగే ఇప్ప‌టి వారి కంటే పూర్వీకులే ఎక్కువ‌గా ముహుర్తానికి ప్రాధాన్య‌త ఇచ్చేవారు. వివాహం ఏ స‌మ‌యానికి చేయాలో ఆ స‌మ‌యానికి చేసేవారు. అందుకే అప్ప‌టి కుటుంబంలోని వారు జీవితాంతం సుఖ‌సంతోషాల‌తో, సిరిసంప‌ద‌ల‌తో నిండు నూరేళ్లు హాయిగా జీవించేవారు. అలాగే పిల్లా పాప‌ల‌తో సంతోషంగా గ‌డిపేవారు. అందుకే వివాహాన్ని స‌రైన స‌మ‌యానికి జ‌రిపించాలి.

Astrology tips missed the marriage muhurtham face these problems

Astrology tips missed the marriage muhurtham face these problems

ఇప్ప‌టి కాలంలో మాత్రం పెట్టిన ముహుర్తానికి, వివాహం జ‌రిగే స‌మ‌యానికి అస‌లు సంబంధ‌మే ఉండ‌డం లేదు. ముహుర్తం దాటాక వివాహాన్ని జ‌రిపిస్తున్నారు. ఎందుకంటే వ‌ధూవ‌రులు అలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. దీనివ‌ల‌న ముహుర్త స‌మ‌యం దాటిన త‌రువాత వివాహం జ‌రుగుతుంది. దీనివ‌ల‌న వివాహా బంధానికి ఎక్కువ బ‌లం ఉండ‌దు. వివాహం స‌రైన స‌మ‌యానికి జ‌ర‌గ‌క జీవితంలో వివిధ ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. జీవితాంతం సంసార జీవితంలో ప‌లు ర‌కాల బాధ‌ల‌ను అనుభ‌విస్తారు అని జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు అంటున్నారు. వివాహం స‌రైన ముహుర్తానికి జ‌ర‌గ‌క‌పోతే ఎటువంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్య‌శాస్త్ర ప్ర‌కారం వివాహం పండితులు పెట్టిన ముహుర్తానికి జ‌ర‌గ‌క‌పోతే వ‌ధూవ‌రుల జీవితంలో సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డం, ఇరువురి మ‌ధ్య చిన్న చిన్న విభేదాలు రావ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొంద‌రు ఇరువురు విడిపోయే దాకా వ‌స్తారు. అందుకే వివాహాన్నిస‌రైన స‌మ‌యానికి జ‌రిపించాలి. ఇటువంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే మ‌న పూర్వీకులు స‌రైన ముహుర్తానికి వివాహం జ‌రిపించేవారు. స‌రైన ముహుర్తానికి వివాహం జ‌రిపిస్తే వ‌ధూవ‌రులు జీవితాంతం అన్యోన్యంగా, సుఖ‌సంతోషాల‌తో, పిల్లా పాప‌ల‌తో హాయిగా జీవిస్తారు. అందుకే హిందువులు ఆచార సాంప్ర‌దాయాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవారు. కాబ‌ట్టి అలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా వివాహ ముహుర్తానికి పెళ్లి జ‌రిపించండి. జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా హాయిగా జీవించండి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది