
atmakur by elections bjp vs janasena
BJP – Janasena : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా ఆత్మకూరు కు కూడా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గత కొంత కాలంగా బీజేపీ మరియు జనసేన పార్టీ లు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాయి. ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా రెండు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకుందా అన్నట్లుగానే అడుగులు వేసిన విషయం తెల్సిందే.
ఏపీలో జరిగిన వరుస స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఆమద్య జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. కనుక ఆత్మకూరులో కూడా కలిసి పోటీ చేస్తాయి అనుకున్నారు. కాని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆ పార్టీ కి చెందిన ఎంపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్నాం.. రోడ్డు మ్యాప్ తయారు అవుతుందని గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న బీజేపీ వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తో అసలు 2024 అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు ఉంటుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
atmakur by elections bjp vs janasena
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం మరియు బీజేపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని తెలుగు దేశం పార్టీతో కలిసేందుకు అస్సలు ఆసక్తి చూపని బీజేపీ మాత్రం మొదటి నుండి దూరం దూరం అన్నట్లుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఒంటి పోరాటం వల్ల ఖచ్చితంగా ఇది జనసేనతో విభేదించడం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కనుక జనసేనతో దూరం అయితే వైకాపా దరి చేరే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ముందే రాబోతున్న ఈ ఉప ఎన్నికలతో అప్పటి పిక్చర్ కు ఇప్పుడు క్లారిటీ రాబోతుంది.
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
This website uses cookies.