Home » Andhra Pradesh » Balakrishna Comments On Ap Minister Roja
andhra pradesh

Balakrishna – Roja : ఏయ్ రోజా.. నా జోలికొస్తే ఇంకా నీకు దబిడిదిబిడే.. బాలకృష్ణ సీరియస్ వార్నింగ్.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 30, 2023 7:33 pm
Advertisement

Balakrishna – Roja : నందమూరి బాలకృష్ణ తెలుసు కదా. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లెజెండ్. ఆయన సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. నారా లోకేశ్ యువగళం పేరుతో యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా వెళ్లిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మంత్రి రోజాపై ఫైర్ అయ్యారు. యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది.

Advertisement

దాని ఫలితాన్ని మీరు త్వరలోనే అనుభవిస్తారు. ప్రస్తుతం ఏపీలో పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. మద్యం, డ్రగ్స్ తో యూత్ ను బానిసల్లా మార్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇక ఎవ్వరూ వాళ్లకు ఎదురు తిరగకూడదు. ఇదంతా కక్ష సాధింపు. నేను వాస్తవాలు మాట్లాడుతా. నాకు సైకాలజీ తెలుసు. మీ అందరికీ చెబుతున్నా. మనమంతా రోగుల్లా ఉన్నాం. మనుషులంటే వాళ్లకు ఎలర్జీ.. అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

Advertisement

balakrishna comments on ap minister roja

Balakrishna – Roja : మీ ఓటు ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకోండి

మీకున్న ఓటు ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకోండి అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. నిజాలు చేదుగా ఉంటాయి. టీడీపీ అధికారంలోకి రాబోతోందని వైసీపీ నేతలకు కూడా తెలిసింది. వాళ్లు ఓడిపోతారని తెలుసు. అందుకే వాళ్లు ఏదైనా చేయడానికి వెనుకాడటం లేదు. వైసీపీ నేతల మాటలు అలాగే ఉంటాయి. ఒక మహిళా మంత్రిగా ఉండి కూడా రోజా అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వాళ్ల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. వైసీపీ అంటేనే బూతుల పార్టీ.. అన్నట్టుగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి