Home » News » Bandi Sanjay Fires On Telangana Cm Kcr
News

Bandi Sanjay : అర్వింద్ ఇంట్లోని దేవుళ్ల ఫోటోలపైనా దాడి చేశారు.. తీవ్రంగా ఖండించిన బండి సంజయ్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 19, 2022, 10:10 pm
Advertisement

Bandi Sanjay : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన విషయంపై ప్రస్తుతం రాష్ట్రమంత చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలే అర్వింద్ ఇంటిపై దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అర్వింద్ ఇంట్లోని ఫర్నీచర్ తో పాటు దేవుళ్ల ఫోటోలపై కూడా దాడి చేశారని ఆయన మండిపడ్డారు.

Advertisement

ఎంపీ అర్వింద్ ఇంటికి వెళ్లిన బండి సంజయ్.. ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. ఇళ్లపై దాడులు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. రాజకీయాల కోసం సొంత బిడ్డనే సీఎం కేసీఆర్ పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటనే అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నేతలు అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారని సంజయ్ దుయ్యబట్టారు.

Bandi Sanjay fires on telangana cm kcr

Advertisement

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని ప్రజలు గమనించాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ బండి సంజయ్ కోరారు. ఇది ప్రజాస్వామ్య దేశం. విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి కానీ.. దాడి చేస్తారా? కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచే తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఈ దాడి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన సంబంధిత పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోనే ఎన్నో గొడవలు ఉన్నాయని.. కేసీఆర్ సీఎంగానే కాదు.. ఒక తండ్రిగా కూడా విఫలమయ్యారంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి