Home » Andhra Pradesh » Big Breaking On Former Minister Kodali Nani In Hospital
andhra pradesh

Big Breaking : హాస్పిటల్ లో మాజీ మంత్రి కొడాలి నాని..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: November 19, 2022, 11:38 am
Advertisement

Big Breaking : గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. కిడ్నీలో రాళ్లు చేరడంతో నాని చికిత్స చేయించుకోవడం జరిగింది. దీంతో పార్టీ కార్యకర్తలు మరియు నియోజకవర్గ నాయకులు కొడాలి నానినీ పరామర్శించడానికి ఆసుపత్రికి వస్తున్నారు. వైసీపీ పార్టీలో దూకుడుగా రాణించే నాయకులలో మొదటి వరుసలో కొడాలి నాని ఉంటారు.

Advertisement

ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో నాని తీరే వేరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుని మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ నీ విమర్శించడంలో ఎప్పుడు ముందుంటారు. రాజకియనేతగా గుడివాడలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొడాలి నానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైసీపీలో సీఎం జగన్ కి అత్యంత నమ్మకస్తుడు అన్న పేరు కూడా ఉంది.

Big Breaking on Former minister Kodali Nani in hospital

Advertisement

ఇదే విషయాన్ని సీఎం జగన్ నిండు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కాగా ఇటీవల కిడ్నీలో రాళ్లు చేరడంతో అపోలో ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది అంట. అపోలో ఐసీయూలో ఉన్న ఆయన రెండు మూడు రోజులలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందట. అనంతరం రెండు వారాలపాటు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. 15 రోజుల తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయనున్నట్లు సమాచారం.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి