#image_title
Bigg Boss BuZZ | బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రష్ఠివర్మని తొలివారంలోనే ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా షాకింగ్‌గానే అనిపించింది.అయితే ఎలిమినేషన్ తరువాత జరిగే బిగ్ బాస్ బజ్ ని శివాజీ హోస్ట్ చేస్తుండటంతో మంచి హైప్ వచ్చింది. అయితే ప్రోమో విడుదల కాగా, శివాజీ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. గతంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేసిన అర్జున్, గీతూ రాయల్, అరియానా, రాహుల్ సిప్లిగంజ్ వాళ్లే బెటర్ అన్నట్టుగా చప్పగా సాగింది.
#image_title
తుస్సుమనిపించాడుగా..
గత సీజన్‌లో అంబటి అర్జున్ జనంలో ఏవైతే సందేహాలు ఉండేవే.. వాటిని సూటిగా సుత్తిలేకుండా కొట్టినట్టుగా అడిగేవాడు. అయితే శివాజీ బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేసరికి అంతకు మించే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ.. శ్రష్ఠి వర్మ బజ్ ఇంటర్వ్యూ చూస్తూ.. అబ్బే పసలేదు అనేట్టుగానే ఉంది. రోస్టింగ్ కాదు కదా.. ప్రశ్నలు కూడా సప్పగా సాగినట్టే ఉన్నాయి. రివర్స్‌లో శ్రష్టి.. శివాజీనే రోస్ట్ చేసినట్టుగా ఉంది.
శివాజీ హోస్ట్ చేస్తాడనడంతో బజ్ ఇంటర్వ్యూపై అంచనాలు పెరిగాయి. అయితే ఆయన హోస్టింగ్‌తో మాత్రం తుస్సుమనిపించారు. శివాజీ ఉన్న బిజీ షెడ్యూల్‌లో బజ్ ఇంటర్వ్యూకోసం అంత టైమ్ కేటాయించడం కష్టం కాబట్టి.. బిగ్ బాస్ టీం ఏదైనా ప్రశ్నలు వేయమంటుందో అవి వేసి వెళ్లిపోవడం తప్పితే చేయగలిగింది ఏం లేదు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎలాగైతే టాక్ బ్యాక్‌లో బిగ్ బాస్ టీం ఆడించనట్టుగా ఆడి ఎలా వెళ్లిపోతారో.. బజ్ ఇంటర్వ్యూలోనూ శివాజీ అదే పాత్రను పోషించినట్టు అర్ధమవుతుంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.