Home » Entertainment » Biggest Blockbuster In Balakrishna Career
Entertainment

Akhanda Movie : బాల‌కృష్ణ‌ కెరీర్‌లోనే బిగ్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌.. జై బాల‌య్య నినాదాల‌తో దద్దరిల్లుతోన్న థియేటర్లు..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 2, 2021, 1:00 pm
Advertisement

Akhanda Movie నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీకాంత్ ప్రతి నాయకుడిగా, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తి బాబులతో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను రూపొందించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. బాల‌య్య-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలలాగే హిట్ టాక్ సొంతం చేసుకుని వారివురికి హ్యాట్రిక్ ను కట్ట బెట్టింది. బాలయ్య మాస్ అభిమానులంతా థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Advertisement

Akhanda Movie దద్దరిల్లుతోన్న థియేటర్లు

మొదటి రోజు ప్రీమియర్ షోలతో మొదలైన ఈ చిత్రం బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఉదయాన్నే థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. మ‌రోవైపు సినిమాలోని యాక్ష‌న్ సీన్లు, డైలాగులు అప్పుడే సోష‌ల్ మీడియాలో లీక్ అయి హైప్ క్రియేట్ అవడంతో.. మరింత మంది సినిమా హాళ్లకు క్యూ కడుతున్నారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్లన్ని దద్దరిల్లి పోతున్నాయి. అసలే బాలయ్య ఫ్యాన్సు… డబుల్ మాస్ సీన్లు, డైలాగ్ లతో బోయపాటి కాంబినేషన్ సినిమా.. ఇక నందమూరి ఫాన్స్ హంగామా షురూ అయింది.

biggest blockbuster in Balakrishna career

Advertisement

Akhanda Movie బాలయ్యకు దీటుగా శ్రీకాంత్

బాలయ్య అఘోరా పాత్రలో విశ్వరూపం చూపించారు. శ్రీకాంత్ కూడా తన డైలాగ్ డెలివరీతో బాలయ్యకు దీటుగా నటిస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తానికి సినిమాకు ఉదయం నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ ఆహాలో అన్‌స్టాప‌బుల్ టాక్ షో విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలయ్యలో… ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ విజయం మరింత ఉత్సాహం నింపుతోంది. అఖండ చిత్రానికి బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ లు ద్వారా ఈ సినిమాకు దాదాపు 1 మిలియన్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. సినీ ప్రియులు, బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి. బాలయ్య బాబు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి